రాజమౌళిపై లాస్ ఏంజిల్స్ టైమ్స్ కథనం... మధ్యలో పవన్ మూవీపై హరీశ్ ట్వీట్
రాజమౌళికి శుభాకాంక్షలు చెబుతూ హరీశ్ శంకర్ ట్వీట్ చేస్తే, పవన్‌కల్యాణ్ సినిమా ఇలా తీయండి అంటూ ఓ నెటిజన్ సూచనలు చేశాడు. దీనిపై హరీశ్ శంకర్ ఇచ్చిన రిప్లై సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) టేకింగ్‌కు హాలీవుడ్ ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ విదేశీ మీడియా సైతం ఆయన దర్శకత్వాన్ని మెచ్చుకుంటోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తున్నారు. విదేశీ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో జక్కన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ట్విటర్ వేదికగా ఆ పత్రిక ఇమేజ్‌ను పోస్ట్ చేస్తూ శుభాభినందనలు చెబుతున్నారు. అభిమానులే కాదు, సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగు దర్శకుడికి దక్కిన గౌరవానికి గర్వపడుతూ సదరు పోస్ట్‌ను షేర్ చేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ నమస్కారం ఎమోజీలను ఉంచారు. హరీశ్ ట్వీట్‌కు మరో నెటిజన్ స్పందిస్తూ ‘సర్.. పవన్‌కల్యాణ్‌తో మరోసారి సినిమా చేసే అవకాశం మీకు లభించింది. గబ్బర్ సింగ్‌లాంటి రొటీన్ మసాలా మూవీని మళ్లీ చేయొద్దు. అంతర్జాతీయ స్థాయిలో అందరూ తమ సినిమా అనుకునేలా మూవీ తీయండి. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. హీరో కొడితే ఎగిరిపడే ఫైట్ సీన్స్ కూడా వద్దు. ప్రతి ఫైట్ సహజంగా ఉండాలి’ అని కోరాడు. దీనికి హరీశ్ శంకర్ సమాధానం ఇచ్చారు. ‘మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. మీతో నేను అంగీకరించను’ అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ‘భవదీయుడు భగత్ సింగ్’ అంటూ టైటిల్‌ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం పవన్ అటు రాజకీయాలు ఇటు ముందుగా ఒప్పుకొన్న సినిమాలు చేయాల్సి రావడంతో పవన్-హరీశ్ శంకర్ మూవీ ఆలస్యమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
Politics News
Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్ సూచన
-
Sports News
Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్