BheemlaNayak: చాలా రోజుల తర్వాత పవన్‌ గర్జన చూశా: హరీశ్‌ శంకర్‌

పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసిందది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ...

Published : 25 Feb 2022 10:12 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘భీమ్లానాయక్‌’ శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా పవన్‌ మేనియా కనిపిస్తోంది. బొమ్మ సూపర్‌ హిట్‌ అంటూ నెటిజన్లు వరుస పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌ ప్రముఖులు సైతం ‘భీమ్లానాయక్‌’ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘భీమ్లానాయక్‌’ అదుర్స్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘భీమ్లానాయక్‌’పై రివ్యూ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్లలో పవన్‌ గర్జన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. తమన్‌ మ్యూజిక్‌ సినిమాకి వెన్నెముక అని కామెంట్‌ చేశారు.

‘‘భీమ్లానాయక్‌’ పాత్రలో పవన్‌కల్యాణ్‌ సింహ గర్జన చేశారు. చాలా రోజు తర్వాత థియేటర్‌లలో ఆయన నట గర్జన చూడటం అద్భుతంగా ఉంది. గొప్ప పనితీరు కనబరిచిన సాగర్‌ కె.చంద్ర, త్రివిక్రమ్‌, నాగవంశీ మొత్తం టీమ్‌ అందరికీ అభినందనలు. తమన్  అందించిన మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బావా... నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌. ప్రతి సన్నివేశాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానం, అందుకు అనుగుణంగా మ్యూజిక్‌ ఇచ్చిన తీరు బాగుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా..! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా..! ఇక, రానా.. నీలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు. సినిమాలో నీ రోల్‌ చూసిన తర్వాత.. ‘‘రానా .. నీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ’’ ఇది మాత్రమే చెప్పాలని ఉంది’’ అని హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని