Harish Shankar: సినిమానే ఓ భాష... భావోద్వేగం!

‘‘మంచి సినిమాని పది మందికి చూపించాలనే ప్రయతాన్ని మెచ్చుకోవాలి. మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా మన ప్రేక్షకులు చూస్తార’’న్నారు ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్‌.

Updated : 26 May 2023 13:57 IST

‘‘మంచి సినిమాని పది మందికి చూపించాలనే ప్రయతాన్ని మెచ్చుకోవాలి. మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా మన ప్రేక్షకులు చూస్తార’’న్నారు ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్‌. ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రధారిగా.. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తెలుగులో బన్నీ వాస్‌ విడుదల చేస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హరీష్‌శంకర్‌ మాట్లాడారు. ‘‘ఇప్పుడు సినిమాకి భాషతో సంబంధం లేదు. సినిమానే ఓ భాష, ఓ భావోద్వేగం. డబ్బింగ్‌, రీమేక్‌ అనే తారతమ్యం లేదు. మంచి సినిమానా కాదా అనేదే ముఖ్యం. ‘2018’ వరదల నేపథ్యంలో తీసిన ఓ  మంచి సినిమా. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌, బన్నీ వాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని