Harish Shankar: ఉస్తాద్ భగత్‌సింగ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ కౌంటర్
సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar). ఈక్రమంలోనే తన తదుపరి చిత్రం గురించి కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: తన ఫిల్మోగ్రఫీని, ముఖ్యంగా ఉస్తాద్ భగత్‌సింగ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన ఓ నెటిజన్‌కు దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) కౌంటర్ ఇచ్చారు. వివరణలు ఇవ్వడానికి ట్విటర్ వేదిక కాదని అన్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
హరీశ్ శంకర్ (Harish Shankar) - పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh). కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న ‘తెరీ’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ హరీశ్ శంకర్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. సుమారు మూడేళ్లు సమయం తీసుకుని రీమేక్ చేయడం ఏమిటని ప్రశ్నించాడు. ‘‘షాక్ - ఫ్లాప్, మిరపకాయ్ - సూపర్‌హిట్, గబ్బర్‌సింగ్ - బ్లాక్‌బస్టర్, రామయ్యా వస్తావయ్యా - ఫ్లాప్, సుబ్రమణ్యం ఫర్ సేల్ - సూపర్ హిట్, దువ్వాడ జగన్నాథమ్ - హిట్, గద్దలకొండ గణేశ్ - హిట్.. కథలను రచించడంలో అద్భుతమైన టాలెంట్ ఉన్న హరీశ్ శంకర్ మూడేళ్లు సమయం తీసుకుని రీమేక్‌ను తెరకెక్కించడం ఏమిటి? ఇప్పుడు ఆయన చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ అంటగా?’’ అని నెటిజన్ ప్రశ్నించగా.. దానిపై హరీశ్ స్పందించారు. ‘‘కేవలం భావాలను వ్యక్తం చేయడానికే ట్విటర్ అనేది వేదిక. అంతేకానీ, వివరణ ఇవ్వడానికి కాదు’’ అని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు హరీశ్ ట్వీట్‌కు మద్దతు తెలుపుతుండగా.. మరికొంతమంది మాత్రం.. ‘‘సర్. ఇది రీమేక్ యేనా’’ అని అడుగుతున్నారు. మరోవైపు పవర్‌స్టార్ అభిమానులు మాత్రం అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh) ను మొదట ‘భవధీయుడు భగత్‌సింగ్’ పేరుతో అనౌన్స్ చేశారు. కథకు అనుగుణంగా టైటిల్‌లో కాస్త మార్పులు చేసి.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Devineni uma: జగన్ కనుసన్నల్లో.. సజ్జల డైరెక్షన్లోనే దాడులు: దేవినేని ఉమ
-
Crime News
Guntur: ట్రాక్టర్ బోల్తా: ఐదుగురి మృతి.. 20 మందికి గాయాలు
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ‘నిర్లక్ష్యం’ అభియోగాలతో కేసు నమోదు..!
-
Movies News
Sumalatha: సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లి.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
-
General News
CM KCR: భారాస మానవ వనరుల కేంద్రానికి సీఎం కేసీఆర్ భూమిపూజ
-
India News
Bridge Collapse: రూ.1700 కోట్ల వంతెన కూల్చివేత.. గార్డు గల్లంతు..