ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ

వ్యాఖ్యాత, నటి హరితేజ తల్లయ్యారు. సోమవారం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Published : 06 Apr 2021 11:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ః టీవీ వ్యాఖ్యాత, నటి హరితేజ సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బేబీ బంప్‌ సమయంలో తన భర్త దీపక్‌తో కలిసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశారు. ౨౦౧౫లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు హరితేజ, దీపక్‌. టెలివిజన్‌ నటిగా, వ్యాఖ్యాతగా తన ప్రయాణం మొదలుపెట్టిన హరితేజ ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ‘అ ఆ’ సినిమాలోని మంగమ్మ పాత్రతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ‘అల్లుడు అదుర్స్‌’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని