Harom Hara: ఈటీవీ విన్‌లో ‘హరోం హర’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సుధీర్‌ బాబు నటించిన యాక్షన్‌ చిత్రం ‘హరోం హర’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

Updated : 09 Jul 2024 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సుధీర్‌ బాబు (Sudheer Babu)లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). అతడు నటించిన పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా ఇది. జూన్‌ 14న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి సందడి చేయనుంది. ‘ఈటీవీ విన్‌’ (ETV Win), ‘ఆహా’ (Aha)లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది (Harom Hara OTT Release Date). 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్‌. లక్కీ లక్ష్మణ్‌, రవి కాలే, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జ్ఞానసాగర ద్వారక దర్శకుడు.

ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

కథేంటంటే: కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్‌), అతని తమ్ముడు బసవరెడ్డి (రవి కాలే) దారుణమైన అకృత్యాలకు పాల్పడుతుంటారు. వారికి భయపడి ఆ ఊరిలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అలాంటి కుప్పం ప్రాంతంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోకి ల్యాబ్‌ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం. ఓసారి అనుకోని పరిస్థితుల్లో తమ్మిరెడ్డి గ్యాంగ్‌తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అదే సమయంలో తండ్రి శివారెడ్డి (జయప్రకాశ్‌) చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు సంపాదించడం కోసం తన మిత్రుడు, సస్పెండ్‌ అయిన పోలీస్‌ పళని స్వామి (సునీల్‌)తో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆయుధాల అక్రమ తయారీ వ్యాపారంలో సుబ్రహ్మణ్యం ఏ స్థాయికి వెళ్లాడు? ఈ క్రమంలో అతనికి ఎంత మంది శత్రువులయ్యారు? వారి నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆఖరికి తమ్మిరెడ్డి గ్యాంగ్‌ నుంచి కుప్పం ప్రాంతాన్ని ఎలా కాపాడాడు? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని