‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌కి పవన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లేనా?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికే...

Published : 28 Jul 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగా, తదుపరి షెడ్యూల్‌ని ఏప్రిల్లో పూర్తిచేయడానికి చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసింది. అయితే పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అది జరగలేదు.  పవన్‌కల్యాణ్ ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో పవన్‌ బస్సు యాత్ర ప్రకటించిన నేపథ్యంలో ఆ లోపు ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారట. అందుకు పవన్‌ కూడా అంగీకరించినట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక ‘హరిహర వీరమల్లు’  విషయానికొస్తే పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే భారీబడ్జెట్‌, పాన్ ఇండియా, చారిత్రక నేపథ్యం లాంటి విశేషాలతో రూపుదిద్దుకుంటోంది. ఇక క్రిష్ దర్శకత్వం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)‌, నర్గీస్‌ ఫక్రీ (Nargis Fakhri), అర్జున్‌రామ్‌పాల్‌ (Arjun Rampal) ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి (M.M. Keeravani) సంగీతమందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుడు బెన్‌లాక్ ‌(Ben Lock) ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్‌ హంగులను సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, ప్రచారచిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు, అభిమానులకు ఈ సినిమాపై భారీఅంచనాలే ఉన్నాయి. ఈ సంవత్సరాంతంలో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts