Allu Sirish: అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీబేర్‌ని చూశారా!

‘బడ్డీ’తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు శిరీష్‌. ఆయన హీరోగా  నటించిన   ఈ చిత్రాన్ని శామ్‌ ఆంటోన్‌ తెరకెక్కించారు. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా నిర్మించారు.

Updated : 26 Jun 2024 10:13 IST

డ్డీ’తో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు శిరీష్‌. ఆయన హీరోగా  నటించిన   ఈ చిత్రాన్ని శామ్‌ ఆంటోన్‌ తెరకెక్కించారు. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా  రాజేశ్‌ సింగ్‌ కథానాయికలు. అజ్మల్, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు అన్యాయం    జరిగినా ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు. అన్యాయంపై తిరగబడిన ఓ టెడ్డీబేర్‌ను చూశారా.. చూస్తారా?’’ అంటూ ట్రైలర్‌లో సాయికుమార్‌ చెప్పిన డైలాగ్‌తోనే ఈ చిత్ర కథేంటన్నది స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ వేడుకలో హీరో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. ‘‘టెడ్డీ బేర్‌తో యాక్షన్‌ చిత్రమంటే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని అనుకున్నా. కానీ, ఈ రోజు ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూశాక చాలా నమ్మకం వచ్చింది. ఇది కచ్చితంగా    రెగ్యులర్‌ సినిమా కాదు. చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో హీరో   నేను కాదు.. టెడ్డీబేర్‌. ఆ పాత్ర బాగా నచ్చే నేనీ సినిమా చేశా.   నా హీరోయిజం చూపించాలని కాదు. నాతో ఇంత భారీ ఖర్చుతో ఇలాంటి యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా చేసిన నిర్మాత జ్ఞానవేల్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘రాజమౌళి చేసిన ‘ఈగ’ మా ‘బడ్డీ’ చిత్రానికి స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు శామ్‌ ఆంటోన్‌. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఇటీవలే కొంతమందికి చూపించా. ‘సినిమా బాగుంది.. శిరీష్‌  బాగా నటించాడ’ని చెప్పారు.  తప్పకుండా దీన్ని అందరూ పెద్ద హిట్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్‌ రెడ్డి, కృష్ణన్‌ వసంత్, అలీ, గాయత్రి, ప్రిషా, అజ్మల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని