Published : 04 Aug 2022 01:41 IST

Alia Bhatt: అతనొక అద్భుతం.. తెరపై మ్యాజిక్‌ చేస్తాడు: అలియా భట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డార్లింగ్స్‌’ (Darlings) సినిమా ప్రచారంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్‌ నటి అలియాభట్‌‌ (Alia Bhatt) తనదైన శైలిలో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆశించిన స్థాయిలో విజయాలు లేక సతమవుతున్న ‘బాలీవుడ్ బాద్‌షా’ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కి ఎటువంటి సలహాలు ఇస్తారు? అని అలియాను ప్రశ్నించగా.. ‘సినిమా జయాపజయాలతో సంబంధం లేని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌’ అని అమె పేర్కొన్నారు. ‘అతనొక అద్భుతం, తెరపై తన నటనతో మ్యాజిక్‌ చేసే మెజీషియన్‌’ అని ఆమె కితాబిచ్చింది. ‘అతనికి ఎవరి సలహాలు అవసరం లేదు. అతని రాబోయే చిత్రాలు ‘పఠాన్’‌, ‘డుంకీ’లలో ఎటువంటి మ్యాజిక్‌ చేయబోతున్నారనే విషయంపై నేనే అతని దగ్గర సలహాలు తీసుకుంటాను’ అని ఆమె తెలిపింది. ఇంకా తన ‘ఆల్‌టైం ఫేవరెట్ స్టార్స్‌’గా షారుక్‌ఖాన్‌, కరీనాకపూర్‌, తన భర్త రణ్‌బీర్‌కపూర్‌ పేర్లను అలియాభట్‌ ప్రస్తావించింది. రాబోయే హిందీ సినిమాల విజయం పట్ల అలియా ఆశాభావం వ్యక్తం చేసింది. అలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘డార్లింగ్స్‌’ ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవ్వనుంది. మరోవైపు రియల్‌ జంట(రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌) కలిసి నటించిన భారీ బడ్జెట్‌ పాన్‌ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’(BRAHMASTRA) సెప్టెంబరు 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.   


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని