Vijay Antony: పెద్ద ప్రమాదం కాదు.. విజయ్‌ ఆరోగ్యంపై స్పందించిన సన్నిహిత వర్గాలు

నటుడు విజయ్‌ ఆంటోనీ ఆరోగ్యంపై ఆయన సన్నిహిత వర్గాలు స్పందించాయి. నటుడు చెన్నైకు చేరారని తెలిపాయి.

Published : 19 Jan 2023 01:37 IST

కోడంబాక్కం: నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం సినిమా పనులు చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘పిచ్చైకారన్‌’ 2’ (తెలుగులో బిచ్చగాడు 2) సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విజయ్‌ పరిస్థితి దారుణమంటూ వస్తోన్న వార్తలపై సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. ‘‘విజయ్‌ నడుముకు స్వల్వ గాయమైంది. దాన్నుంచి కోలుకుని తన సినిమా పనులు చేసుకుంటున్నారు. చిత్రీకరణ వాయిదా పడింది. మీడియాలో వస్తున్నట్టు ఆయనకు పెద్ద ప్రమాదం జరగలేదు. ఆరోగ్యంగా ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు’’ అని వెల్లడించాయి.

స్వీయ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ నటిస్తోన్న చిత్రమే ‘బిచ్చగాడు 2’ (Pichaikkaran 2). గతంలో ఈయన హీరోగా వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ మలేషియా సమీపంలోని లంకావి అనే దీవిలో జరుగుతోంది. జెట్‌స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్‌కు గాయమైంది. ‘బిచ్చగాడు’తోపాటు ‘డాక్టర్‌ సలీమ్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్‌. ‘మహాత్మ, ‘దరువు’ చిత్రాలతో సంగీత దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని