Rajinikanth: రజనీకాంత్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌.. వైద్యులు ఏమన్నారంటే?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Updated : 29 Oct 2021 18:38 IST

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రిలో చేరారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తాజాగా రజనీ ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి.

‘‘రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే. అయితే, ఆయన మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించాం. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించాం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. త్వరలోనే రజనీకాంత్‌ డిశ్చార్జ్‌ అవుతారు’’ అని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘అన్నాత్తే’ దీపావళికి విడుదల కానుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండ్రోజుల క్రితం దిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్‌ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య తిలకించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని