Hello Meera: హరీశ్‌ శంకర్‌ లాంఛ్‌ చేసిన ‘హలో..మీరా..!’ టీజర్‌..

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘హలో.. మీరా..!’ టీజర్‌ను విడుదల చేశారు. కేవలం ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందించిన ఈ చిత్ర టీజర్‌ ఆసక్తికరంగా ఉందని తెలిపారు.

Updated : 07 Dec 2022 17:33 IST

హైదరాబాద్‌: గార్గేయి యల్లాప్రగడ(Gargeyi Yellapragada) ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో.. మీరా..!(Hello Meera)’. కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌(Harish Shankar) ఈరోజు విడుదల చేశారు. కేవలం సింగిల్‌ క్యారెక్టర్‌తో సినిమా సాగనుంది. అదే ఇందులోని ప్రత్యేకత. సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం కథ మీరా అనే పాత్ర చూట్టూ తిరుగుతుంది.  తెరపై కనిపించే మీరాతో పాటు తెర వెనుక ఫోన్‌లో వినిపించే పాత్రలు ఉత్కంఠరేపుతున్నాయి. టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉందని.. టీమ్‌ అందరికీ హరీశ్‌ శంకర్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. లూమియర్‌ సినిమా బ్యానర్‌పై జీవన్‌ కాకర్ల సమర్పణలో లక్ష్మణరావు, వరప్రసాదరావు, పద్మ ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు