Hema: మంచు విష్ణుని కలిసిన హేమ.. నిర్దోషినంటూ లేఖ

డ్రగ్స్‌ కేసులో తాను నిర్దోషినని నటి హేమ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి తనను తొలగించడం అన్యాయమన్నారు.

Updated : 08 Jul 2024 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తనను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి తొలగించడం అన్యాయమని నటి హేమ అన్నారు. తిరిగి సభ్యత్వం కల్పించాలని కోరారు. ఇటీవల బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు ఆమెను (Hema) అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసోసియేషన్‌ నుంచి హేమను సస్పెండ్‌ చేసినట్లు ‘మా’ ప్రకటించింది. ఈ  అంశంపై తాజాగా ఆమె బహిరంగ లేఖ రాశారు. దాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు (Manchu Vishnu) అందజేశారు. తాను నిర్దోషినని పేర్కొన్నారు.

బాక్సాఫీస్‌కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో

‘మీడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా నాపై జరుగుతోన్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఈ పరిస్థితుల్లో నాకు ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నా. ఇలాంటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. ఈ విషయాన్ని గమనించి నాపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని