2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

2018 movie ott release date: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘2018’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది!

Published : 29 May 2023 17:57 IST

హైదరాబాద్‌: జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. కేరళలో సంభవించిన వరదల ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇటీవల తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ‘2018’ ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 7వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ (2018 movie ott release date) కానుంది. సోనీలివ్‌ యాప్‌లో ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. మలయాళ సినీ చరిత్రలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా 2018 నిలిచింది.

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే: ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఓ యువ‌కుడు అనూప్ (టోవినో థామస్). ఓ పెద్ద మోడ‌ల్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్న మ‌త్య్స‌కార కుటుంబానికి చెందిన మ‌రో యువ‌కుడు నిక్స‌న్ (అసిఫ్ అలీ). టూరిస్ట్‌ల‌కి త‌ల‌లో నాలుక‌లా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న టాక్సీ డ్రైవ‌ర్ కోషి (అజు వ‌ర్ఘీస్‌), కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఉండే త‌మిళ‌నాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవ‌ర్ సేతు (క‌లైయార‌స‌న్‌). ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ అధికారి (కుంచ‌కో బొబన్‌).. ఇలా ఎవ‌రి జీవితాలు వారివి, ఎవ‌రి ప‌నులతో వాళ్లు స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే వాళ్ల జీవితాలు అనూహ్య‌మైన ఆటుపోట్ల‌కి గుర‌వుతాయ‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండరు.  భారీ వ‌ర్షాల‌తో కేర‌ళ‌ని వ‌ర‌ద‌లు ముంచెత్తుతాయి. (2018 telugu movie అనూహ్య‌మైన ఆ ప‌రిణామంతో ఎవ‌రి జీవితాలు ఎలా మారాయి? ప్రాణాలు నిలుపుకొంటే చాల‌నుకునే ప‌రిస్థితుల్లో ఒక‌రికోసం మ‌రొక‌రు ఎలా నిల‌బ‌డ్డార‌నేది తెర‌పైన చూసి ఆస్వాదించాల్సిందే.

‘2018’ మూవీ తెలుగు రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని