Major: ఉన్నికృష్ణన్‌ జయంతి.. ‘మేజర్‌’ నుంచి స్పెషల్‌ వీడియో

అడవి శేషు ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన చిత్రం మేజర్. శశి కిరణ్

Updated : 08 Sep 2022 15:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అడవి శేషు ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన చిత్రం మేజర్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ముంబయి ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్ని కృష్ణన్ 45వ జయంతిని పురస్కరించుకొని చిత్ర బృందం నివాళులర్పిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. మేజర్ జీవితంలోని వివిధ దశలను అడవి శేషుపై చిత్రీకరించిన సన్నివేశాలను వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని