Adipurush Trailer: ప్రభాస్ ‘ఆది పురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
ప్రభాస్ కీలక పాత్రలో నటిించిన ‘ఆది పురుష్’ ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్: ప్రభాస్ (Prabhas) రాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇతిహాసగాథ ‘ఆది పురుష్’ (Adipurush). కృతిసనన్ సీతగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చిత్ర బృందం ఇప్పుడు వాటిని సరిచేసే పనిలో ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ను మరింత నాణ్యతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా విజువల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ అలరించేలా ‘ఆది పురుష్’ ట్రైలర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం మే 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ థియేటర్స్‌లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ట్రైలర్ ప్రదర్శించే థియేటర్స్ జాబితాను సమయాన్ని ప్రభాస్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. 3డీలోనూ ‘ఆది పురుష్’ ట్రైలర్ ప్రదర్శిస్తారట. మరోవైపు జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్ పాత్రలో దేవదత్త నాగే తదితరులు అలరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..
-
Trump: అమెరికాలో ఏదో జరగబోతోంది.. : జోబైడెన్ ఆందోళన
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ