Vijay Sethupathi: ఓటీటీలోనే ‘అనబెల్‌ సేతుపతి’

విజయ్‌ సేతుపతి, తాప్సీ కీలక పాత్రల్లో నటించిన ‘అనబెల్‌ సేతుపతి’ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదల కానుంది.

Published : 27 Aug 2021 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ సేతుపతి, తాప్సీ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనబెల్‌.. సేతుపతి’. దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే, ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17న ‘అనబెల్‌.. సేతుపతి’ స్ట్రీమింగ్‌ కానుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజయ్‌ సేతుపతి రాయల్‌ లుక్‌లో కనిపించగా, తాప్సి గౌను ధరించి ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సుందరాజన్‌ తనయుడు అయిన దీపక్‌ సుందర్‌రాజన్‌  ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా వైవిధ్య చిత్రాలను ఎంచుకుంటున్న విజయ్‌ సేతుపతి, తాప్సీలు కలిసి నటిస్తుండటం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని