New movie updates: మహాశివ రాత్రి స్పెషల్‌.. స్టార్‌ హీరోలు ఇచ్చిన మూవీ అప్‌డేట్స్‌ ఇవే!

ఏదైనా పండుగ వస్తుందంటే చాలు.. త్వరలో విడుదల కాబోయే చిత్రాలు ఒక్కో అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతుంటాయి. నేడు మహాశివరాత్రి సందర్భంగా.. స్టార్‌ హీరోలు వరుసగా తమ తదుపరి చిత్రాల విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

Updated : 01 Mar 2022 16:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏదైనా పండుగ వస్తుందంటే చాలు.. త్వరలో విడుదల కాబోయే చిత్రాలు ఒక్కో అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతుంటాయి. నేడు మహాశివరాత్రి సందర్భంగా.. స్టార్‌ హీరోలు వరుసగా తమ తదుపరి చిత్రాల విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆకట్టుకునే పోస్టర్స్‌ని విడుదల చేయడంతో పాటు టీజర్‌ విడుదల తేదీని ప్రకటించారు. అవేంటో ఓ మీరూ ఓ లుక్కేయండి!

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ విడుదల.. ఆరోజే!

మహాశివరాత్రి సందర్భంగా తన అభిమానులకు తీపి కబురు అందించారు ప్రభాస్‌. ఆయన తదుపరి చిత్రం ‘ఆదిపురుష్‌’ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. ‘‘ 2023 జనవరి 12న ‘ఆదిపురుష్‌’ 3డీలో విడుదల కానున్నట్లు ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తున్నారు.

మహేశ్‌ మాస్‌ లుక్‌.. అదరహో!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వేసవి బరిలో దిగనుంది. ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాశివరాత్రి సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి మహేశ్‌  అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఏం చెప్పిందంటే..

ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌ సమయంలో కెమెరా రోల్‌ అవ్వకుండా ఉంటే.. తారక్‌- చెర్రీలు ఇదిగో.. ఇలా ప్రశాంతంగా ఫోన్లతో గడుపుతుంటారని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ మంగళవారం ట్వీట్‌ చేసింది. ‘‘కెమెరా రోలింగ్ కానప్పుడు స్క్రోలింగ్’’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సెట్‌లో వీరిద్దరు ఎలా ఉంటారనే విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి పంచుకున్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమాను 300 రోజులు షూట్‌ చేసి ఉంటే.. అందులో కనీసం 20-25 రోజులు తారక్‌-చెర్రీ చేసే అల్లరి వల్లే వృథా అయ్యింది’’ అంటూ చెప్పిన సరదా సంగతులు తెలిసిందే!

కొత్త పోస్టర్‌తో ‘భీమ్లా నాయక్‌’ పలకరింపు

పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లా నాయక్‌’ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర.. ఇప్పటి వరకూ రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా. శివరాత్రి సందర్భంగా అభిమానుల కోసం మాస్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫొటో నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

రవితేజ ‘రామారావు..’ టీజర్‌ ఈ సాయంత్రమే

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని