Filmfare Awards 2023: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ఉత్తమ నటి అలియా భట్‌, నటుడు రాజ్‌కుమార్‌రావ్‌

Filmfare Awards 2023 winners: హ్యుందాయ్‌ 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్‌కు చెందిన సినీతారలు ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.

Updated : 28 Apr 2023 07:00 IST

గంగూబాయి కాఠియావాడి, బాదాయ్‌ దోలకు అవార్డుల పంట

ఇంటర్నెట్‌డెస్క్‌:  68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 2023‌’ (Filmfare Awards 2023) వేడుక గురువారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ ఏడాది ‘గంగూబాయి కాఠియావాడి’(Gangubai kathiawadi), ‘బాదాయ్‌ దో’ (badhaai do)చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బదాయ్‌ దో’ను ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. భాషతో సంబంధం లేకుండా యువతను విశేషంగా అలరించిన ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’లోని ‘కేసరియా’ పాటకు ఉత్తమ సాహిత్య, గాయకుడి అవార్డులను అందుకుంది. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.

గురువారం సాయంత్రం నుంచే సినీ తారల రాకతో మొదలైన వేడుక ఆహూతులను అలరించింది. ఈ సందర్భంగా పలువురు తారలు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌ భామలు అదిరిపోయే ట్రెండీ దుస్తుల్లో వేడుకకు హాజరై అందాలతో కనువిందు చేశారు. (Filmfare Awards 2023) అలియా భట్‌, జాన్వీ కపూర్‌, భూమి పెడ్నేకర్, పూజాహెగ్డే,  ఫాతిమా సనా ఖాన్‌, దియా మీర్జా, నర్గీస్‌ ఫక్రీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సన్నీ లియోని వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2023 విజేతలు వీరే..

  • ఉత్తమ చిత్రం: గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌): బదాయ్‌ దో (హర్షవర్థన్‌ కుల్‌కర్ణి)
  • ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్‌ రావ్‌ (బదాయ్‌ దో)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌): సంజయ్‌ మిశ్రా (వధ్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): టబు (భూల్‌ భులయా2), భూమి పెడ్నేకర్‌ (బదాయ్‌ దో)
  • ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
  • ఉత్తమ సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్‌ దో)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ నేపథ్యగాయని: కవిత సేథ్‌ (రంగిసరి- జగ్‌జగ్‌ జీయో)
  • ఉత్తమ కథ: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి(బదాయ్‌ దో)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్థన్‌ కుల్‌కర్ణి( బదాయ్‌ దో)
  • ఉత్తమ సంభాషణలు: ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్ ‌(గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: బిస్వదీప్‌ దీపక్‌ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర: శివ)
  • ఉత్తమ ఎడిటింగ్‌: నినద్‌ ఖనోల్కర్‌ (ఏన్‌ యాక్షన్‌ హీరో)
  • ఉత్తమ యాక్షన్‌: పర్వేజ్‌ షేక్‌ (విక్రమ్‌ వేద)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: డెంజ్‌, రెడీఫైన్‌ (బ్రహ్మాస్త్ర పార్ట్‌-1: శివ)
  • ఉత్తమ కొరియోగ్రఫీ: కృతి మహేశ్‌ (దోలిడియా-గంగూబాయ్‌ కాఠియావాడి)
  • ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్‌ సింగ్‌సంధు, రాజీవ్‌ బర్నవాల్‌ (వధ్‌)
  • ఉత్తమ తొలి చిత్ర నటుడు: అంకుష్‌ గీదమ్‌ (ఝండ్‌)
  • ఉత్తమ తొలి చిత్ర నటి: ఆండ్రియా కెవిచూసా (అనేక్‌)
  • జీవిత సాఫల్య పురస్కారం: ప్రేమ్‌ చోప్రా
  • ఆర్డీ బర్మన్‌ అవార్డు: జన్వీ శ్రీమంకర్‌ (దోలాడియా:గంగూబాయి కాఠియావాడి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు