Avatar2: ‘అవతార్‌2’ రన్‌ టైమ్‌.. వామ్మో అన్ని గంటలా..!

‘అవతార్2’ రన్‌ టైమ్‌ విషయంలో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. మూడు గంటల పాటు మరో కొత్త ప్రపంచంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు.

Published : 11 Dec 2022 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్‌2’ (Avatar2). జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర రన్‌టైమ్‌ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అవతార్‌2’ నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి.

‘అవతార్2’ రన్‌ టైమ్‌ విషయంలో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. మూడు గంటల పాటు మరో కొత్త ప్రపంచంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. 2009లో వచ్చిన మొదటి ‘అవతార్‌’ చిత్రం రన్‌ టైమ్‌ 162 నిమిషాలు. అంటే 2 గంటలా 42 నిమిషాలు మాత్రమే. మొదటి భాగంతో పోలిస్తే, పార్ట్‌2 అదనంగా దాదాపు మరో అరగంట నిడివి పెరిగింది. ‘అవతార్2’కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 3డీ ఐమ్యాక్స్‌, 4డీ అనుభూతి కలిగిన థియేటర్‌లలో సినిమా చూడాలంటే దాదాపు రూ.1000పైనే టికెట్‌ ధర (మెట్రో నగరాల్లో) ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని