Bhagavanth Kesari teaser: ‘భగవంత్‌ కేసరి’ మాస్‌ టీజర్‌ చూశారా?

Bhagavanth Kesari: బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘భగవంత్‌ కేసరి’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 10 Jun 2023 10:32 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) . కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. శనివారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ అదరగొట్టారు. బాలకృష్ణ మాస్‌ ఇమేజ్‌కు అనిల్‌ రావిపూడి శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్ధమవుతోంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ ‘భగవంత్‌ కేసరి’ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని