Bigg boss telugu: బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వస్తోంది ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’

బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాల్టీ షోలలో ‘బిగ్‌బాస్‌’ది ప్రత్యేక స్థానం. తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు

Published : 14 Aug 2021 18:56 IST

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాల్టీ షోలలో ‘బిగ్‌బాస్‌’ది ప్రత్యేక స్థానం. తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఐదో సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ షోకు సంబంధించిన వివరాలు ఎప్పుడెప్పుడు తెలుస్తాయా? అని ఆశగా ఎదురు చూస్తున్న వారికి  ‘బిగ్‌బాస్‌’ టీం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అగ్ర కథానాయకుడు నాగార్జున మాస్‌ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా దీన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు, ఈసారి హోస్ట్‌ ఎవరన్న దానిపై వస్తున్న వార్తలకు సమాధాన ఇస్తూ నాగ్‌ ఎంట్రీ అదిరింది. ‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరి సీజన్‌-5లో ఎవరెవరు కంటెస్టెంట్‌లుగా ఉంటారు? ప్రేక్షకులను ఎలా అలరిస్తారు? బిగ్‌బాస్‌ ఇచ్చే కొత్త టాస్క్‌లు ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకూ ఈప్రోమో చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు