Bollywood: వామ్మో.. దీపికా పదుకొణె బాడీగార్డ్‌ జీతం ఇంతనా!

సినిమా, స్పోర్ట్స్‌ సెలబ్రెటీలు బయటికి అడుగుపెట్టారంటే చాలు.. వాళ్లని చూడాలని చుట్టూ అభిమానులు గుమిగూడుతుంటారు. సెల్ఫీల

Published : 10 Aug 2021 09:26 IST

సినిమా, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలు బయటకు అడుగుపెట్టారంటే చాలు.. వాళ్లని చూడాలని చుట్టూ అభిమానులు గుమిగూడుతుంటారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్‌ అంటూ ఎగబడుతుంటారు. ఇదంతా వాళ్ల అభిమానానికి నిదర్శనం. అయితే కొన్ని సమయాల్లో ఆ అభిమానం శ్రుతి మించుతుంటుంది. ఇలాంటి వారి నుంచి ప్రముఖులకు రక్షణ కావాలంటే కచ్చితంగా వారికంటూ బౌన్సర్స్‌, బాడీగార్డ్స్‌ తప్పనిసరి! మరి బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ రక్షణ కోసం నియమించుకున్న బాడీగార్డ్స్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే పెద్దపెద్ద కంపెనీల సీఈఓల ఏడాది జీతాలకంటే వీరు ఆర్జించేదే ఎక్కువ మరి.. అది ఎంతో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె బాడీగార్డ్ పేరు జలాల్‌. దీపికా ఇంటి బయట నుంచి అడుగుపెట్టి.. ఎక్కడకెళ్లినా.. జలాల్‌ ఆమెకు దగ్గరుండి రక్షణ కల్పించాల్సిందే. తన దగ్గర పనిచేసినందుకు గానూ ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం ఇస్తుందట. బాడీగార్డ్‌గా కాకుండా తన ఇంటి మనిషిగా భావించి ఏటా రాఖీ కూడా కడుతుందీ ఈ పొడుగుకాళ్ల సుందరి. ఇక దీపికా రణ్‌వీర్‌ వివాహ వేడుక రోజు సెక్యూరిటీ హెడ్‌గానూ ఆయనే విధులు నిర్వర్తించారు.

బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన దీపికా.. అత్యధిక పారితోషికాన్ని తీసుకునే హీరోయిన్ల జాబితాలో ఒకరు. ప్రస్తుతం క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా వస్తున్న ‘83’ చిత్రంలో నటిస్తుండగా, పఠాన్‌తో పాటు ప్రభాస్‌- నాగ్‌అశ్విన్‌ జోడిలో రాబోతున్న చిత్రంలోనూ సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.


ఇక షారుఖ్‌, సల్మాన్, అనుష్క ఎంత జీతాలు ఇస్తున్నారంటే..

కేవలం దీపికా మాత్రమే కాదు.. బాలీవుడ్‌ బడా హీరోలు సైతం అదే రీతిలో ఇస్తారట. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, క్రికెటర్‌ విరాట్‌కోహ్లీ ఆయన సతీమణి అనుష్క సైతం తమ వ్యక్తిగత సంరక్షకులకు భారీగానే జీతాలు ఇస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. షారుఖ్‌ తన బాడీగార్డ్‌ రవిసింగ్‌కు ఏడాదికి రూ.2.7 కోట్లు, కండలవీరుడు సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్‌ షేర్నాకి ఏడాదికి సుమారు రూ.2 కోట్లు.  టీమ్‌ ఇండియా సారథి విరాట్‌కోహ్లీ, బాలీవుడ్‌ భామ అనుష్కశర్మ తన వ్యక్తిగత సంరక్షకుడు ప్రకాశ్‌కు ఏడాదికి సుమారు రూ.1.2 కోట్ల జీతం ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరూ తమ స్థాయిని బట్టి బాడీగార్డ్స్‌కు వేతనాలు చెల్లిస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని