Friendship: హర్భజన్‌ సింగ్‌ ‘ఫ్రెండ్‌షిప్‌’ ట్రైలర్‌ చూశారా?

నేటి సమాజంలో మహిళల్ని ఎలా చూస్తున్నాం? వాళ్లని మనం ఎలా గౌరవించాలనే అంశం    ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ఫ్రెండ్‌షిప్‌’ అంటున్నారు

Updated : 07 Sep 2021 10:05 IST

హైదరాబాద్‌: నేటి సమాజంలో మహిళల్ని ఎలా చూస్తున్నాం? వాళ్లని మనం ఎలా గౌరవించాలనే అంశం    ఆధారంగా రూపొందిన చిత్రమే ‘ఫ్రెండ్‌షిప్‌’ అంటున్నారు ఎ.ఎన్‌.బాలాజీ. ఆయన నిర్మించిన చిత్రమిది. క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కథానాయకులుగా నటించారు. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు. హర్భజన్‌ సింగ్‌ని వెండితెరపై చూడటం ఆనందంగా ఉందనీ, సినిమా విజయవంతం కావాలని ట్విటర్‌ ద్వారా ఆకాంక్షించారు నాగార్జున. నిర్మాత మాట్లాడుతూ ‘‘కళాశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. రాజకీయాల్ని స్పృశించాం. స్నేహం గొప్పతనాన్ని చాటుతూనే,   అమ్మాయిల రక్షణ విషయంలో సమాజానికి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని