Hit: ‘హిట్‌’లో విశ్వక్‌.. ‘హిట్‌ 2’లో శేష్‌.. ‘హిట్‌ 3’ హీరో ఎవరంటే?

‘హిట్‌ 3’లో హీరో ఎవరు? అన్నది ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారింది. ఆ వివరాలివీ..

Published : 03 Dec 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంఛైజీ చిత్రం ‘హిట్‌’ (Hit). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగిపుంగా తెరకెక్కిన ‘ది సెకండ్‌ కేస్‌’లో (Hit 2) అడివి శేష్‌ (Adivi Sesh) నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. దాంతో, మూడో కేస్‌ అయిన ‘హిట్‌ 3’పై ఆసక్తి మొదలైంది. సినిమా విడుదల ముందు వరకూ ‘హిట్‌ 3’లోనూ అడవి శేష్‌ కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ‘హిట్‌ 2’ క్లైమాక్స్‌లో మూడో కేసును ఏ హీరో చేధిస్తాడో హింట్‌ ఇవ్వడంతో అది నిజం కాదని తేలింది. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు నాని (Nani). అర్జున్‌ సర్కార్‌గా ఆయన నటించనున్నారు. ఇప్పటికే ‘జెర్సీ’లో అర్జున్‌గా కనిపించిన నాని మరోసారి అదే నేమ్‌ను ఎంపిక చేసుకోవడానికి కారణం తన కుమారుడని (అర్జున్‌) అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే పాన్‌ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు, ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని ఇటీవల వార్తలొచ్చాయి. మరి, నాని పోలీసు అధికారి వేషం ఎప్పుడు వేస్తారు? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

విశ్వక్‌ సేన్‌, శైలేష్‌, శేష్‌, నాని

‘విక్రమ్‌’, ‘ఖైదీ’ చిత్రాల్లానే ఈ ‘హిట్‌’ కూడా ఓ యూనివర్స్‌. నటులు మారినా సినిమా సినిమాకూ సంబంధం ఉంటుంది. ఈ క్రమంలో ఏడు హిట్‌లు వస్తాయని సమాచారం. ‘హిట్‌’లకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. నాని నిర్మాతగా వ్యవహరించారు. తొలి భాగంలో రుహానీ శర్మ, రెండో భాగంలో మీనాక్షి చౌదరి  నాయికలుగా ఆకట్టుకున్నారు. మూడో పార్ట్‌లో హీరోయిన్‌ ఎవరన్నదీ సినీ ప్రియులకు ఆసక్తే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు