Telugu Movies: ఇయర్‌ ఎండింగ్‌ స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/OTTలో వచ్చే చిత్రాలివే!

ఈవారం ఏయే సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయో ఓ లుక్కేయండి..

Published : 26 Dec 2022 11:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిస్మస్‌ కానుకగా విడుదలైన రవితేజ ‘ధమాకా’, నిఖిల్‌ ‘18 పేజేస్‌’ ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఈ ఏడాది ఆఖరి వారం (డిసెంబరు 29 to 31)లో థియేటర్లలో, OTTలో రిలీజ్ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌లేంటో చూద్దామా! 

టాప్‌ గేర్‌ వేసేందుకు.. 

ఈ ఏడాదిలో ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆది సాయికుమార్‌ (Aadi) ఈ నెల 30న ‘టాప్‌ గేర్‌’ (Top Gear)ను తీసుకొస్తున్నారు. ఉత్కంఠభరిత కథతో తెరకెక్కిన ఈ సినిమాకు కె. శశికాంత్‌ దర్శకత్వం వహించారు.


లక్‌ చెక్‌ చేసుకునేందుకు..

‘బిగ్‌బాస్‌’ ఫేం సయ్యద్‌ సోహైల్‌ (Sohel), మోక్ష జంటగా ఎ.ఆర్‌.అభి తెరకెక్కించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’ (Lucky Lakshman). ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


డ్రైవింగ్‌ స్కిల్‌ చూపించేందుకు..

ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘డ్రైవర్‌ జమున’ (Driver Jamuna). తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 30న విడుదలకానుంది. నేర నేపథ్యం ఉన్న కొందరు వ్యక్తుల వల్ల క్యాబ్‌ డ్రైవర్‌ జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయనే కథాంశంతో దర్శకుడు పా. కిన్‌స్లిన్‌ ఈ చిత్రాన్ని తీశారు.


ఆ రోజే రాజయోగం

సాయి రోనక్‌ (Sai Ronak), అంకిత సాహా, బిస్మినాస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రాజయోగం’ (Rajayogam). రామ్‌ గణపతి దర్శకుడు. ఈ నెల 30న రిలీజ్‌ అవుతుంది. రొమాన్స్‌, కామెడీ, యాక్షన్‌ మేళవింపుతో తెరకెక్కింది.


నో ఎగ్జిట్‌.. 

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘S5... నో ఎగ్జిట్‌’ (S5 No Exit). భరత్‌ కోమలపాటి దర్శకత్వం వహించారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


అనగనగా దేవరకొండలో..

ధనంజయ్‌, అదితి ప్రభుదేవా జంటగా కుషాల్‌ గౌడ తెరకెక్కించిన చిత్రం ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ దేవరకొండ’ (Once Upon A Time in Devarakonda). డిసెంబరు 30న సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.


జాలరిపేటలో ఏం జరిగింది? 

ఆనంద్‌ రవి కథానాయకుడిగా దర్శకుడు శ్రీపతి కర్రి తెరకెక్కించిన చిత్రం ‘కొరమీను’ (Korameenu). స్టోరీ ఆఫ్‌ ఇగోస్‌.. అన్నది ఉపశీర్షిక. శత్రు, హరీష్‌ ఉత్తమన్‌, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ  నేపథ్యంలో యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో సిద్ధమైన ఈ సినిమా డిసెంబరు 31న రాబోతుంది. 


ఓటీటీ వేదికగా రిలీజ్‌ కానున్న సినిమాలు/సిరీస్‌లు

డిస్నీ+ హాట్‌స్టార్‌

🎥 బటర్‌ఫ్లై (తెలుగు, తమిళం, మలయాళం కన్నడ): డిసెంబరు 29

🎥 ఆర్‌ యా పార్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30

🎥 బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30

🎥 ది ఎల్‌ వరల్డ్‌ (హిందీ సిరీస్‌): డిసెంబరు 30


ఆహా

🎥 అన్‌స్టాపబుల్‌ షో (ప్రభాస్‌ ఎపిసోడ్‌): డిసెంబరు 30


నెట్‌ఫ్లిక్స్‌

🎥 వైట్‌ నాయిస్‌ (ఇంగ్లిష్‌): డిసెంబరు 30

🎥 చోటా భీమ్: 15 (ఇంగ్లిష్‌ సిరీస్‌): డిసెంబరు 30

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని