Chiranjeevi: చిరంజీవి 153వ చిత్రం టైటిల్‌ ఇదే.. అభిమానులకు పండగే!

Chiranjeevi: మాస్‌కే బాస్‌ అనేలా చిరంజీవి 153వ చిత్రం ఫస్ట్‌లుక్‌ అందరినీ అలరిస్తోంది

Updated : 21 Aug 2021 18:19 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోష్‌ మీదున్నారు. యువ కథానాయకులకు దీటుగా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ షూటింగ్‌ పూర్తి చేసేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో మరో సినిమాలోనూ నటిస్తున్నారు. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి శనివారం చిరు ప్రీలుక్‌తో పాటు, టైటిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజా చిత్రానికి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మాస్‌ కే బాస్‌’ అనే రేంజ్‌లో చిరు 153వ సినిమా టైటిల్‌, ప్రీలుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్ష్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న చిరు 153వ చిత్రంలో పలువురు స్టార్స్‌ మెరవనున్నారు. ఇప్పటికే సత్యదేవ్‌ మంచి పాత్ర దక్కించుకున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలను కూడా చిత్ర బృందం వెల్లడించనుంది. మరోవైపు మెహర్‌ రమేష్‌, బాబీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు ఆదివారం విడుదల చేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని