Ram Gopal Varma: వర్మ మరో సంచలనం ‘కడప్ప’ వెబ్‌సిరీస్‌

విభిన్న కథలు, నేపథ్యాలను ఎంచుకుంటూ వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో రామ్‌ గోపాల్‌ వర్మ

Updated : 09 Aug 2021 05:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విభిన్న కథలు, నేపథ్యాలను ఎంచుకుంటూ వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. అంతేకాదు, అంతకుమించి వివాదాలతో ఆడుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ‘రక్త చరిత్ర’తో ఫ్యాక్షన్‌ను తనదైన కోణంలో చూపించి సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దానికి అనుబంధంగా ఇప్పుడు ‘కడప్ప’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తీయబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియోను పంచుకున్నారు.

‘‘కొన్ని దశాబ్దాల పాటు పగల మూలంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకుంది ఫ్యాక్షన్‌ వార్‌.ప్రతీకార జ్వాలల నేపథ్యంలో తీస్తున్న మెగా వెబ్‌సిరీస్‌ ‘కడప్ప’ సంబంధించిన ఒక వీడియో ఇది. ఈ మెగావెబ్ సిరీస్‌లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజ జీవితాల ఆధారంగా ఉండబోతున్నాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా నేషనల్ లెవెల్ డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానున్న మొట్ట మొదటి వెబ్ సిరీస్‌ ‘కడప్ప’ అని పేర్కొన్నారు. మరి వర్మ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు