ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌: థియేటర్‌లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!

ఆంధ్రప్రదేశ్‌లోని సినీ అభిమానులకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌) సంస్థ శుభవార్త చెప్పింది.

Updated : 30 May 2023 19:25 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని సినీ అభిమానులకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌) సంస్థ శుభవార్త చెప్పింది. ఇకపై ఫైబర్‌ నెట్‌ సదుపాయం కలిగిన వారు ఇంట్లో కూర్చొనే కొత్త సినిమాలు చూసే వెసులుబాటు కల్పించనుంది. థియేటర్‌ తరహాలో ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చూసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి తెలిపారు. అయితే, ఇందుకోసం నెలకొకసారి కాకుండా రొజుకొకసారి రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. జూన్‌ 2న విశాఖ వేదికగా  కొత్త సినిమా ప్రసారాలను ప్రారంభిస్తామని చెప్పారు.

‘‘ఒక వినూత్నమైన కొత్తదనాన్ని తీసుకురావడానికి థియేటర్‌లో ఏ రోజైతే సినిమా ప్రదర్శన జరుగుతుందో అదే రోజున ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ప్రేక్షకులు అందరూ వీక్షించేలా దీన్ని తీర్చిదిద్దాం. నిర్మాతలతో మాట్లాడిన తర్వాత సినిమా ప్రదర్శితమవుతుంది. కొత్త సినిమాలను సబ్‌స్క్రైబ్‌ చేసుకునేవారు వారికి 24గంటల పాటు అది అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది ఓటీటీ ఫ్లాట్‌ఫాంలాంటిది కాదు.  జూన్‌2న విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మూడు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపాం. పెద్ద సినిమాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అని గౌతమ్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని