Oscars nominations 2023: ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు’.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేషన్‌

  Oscars nominations 2023: 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాల జాబితాను అకాడమీ కమిటీ ప్రకటించింది.

Updated : 12 Mar 2023 18:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ నామినేషన్స్‌ (oscars nominations 2023) జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్‌ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌ మెంబర్స్‌ తుది జాబితాకు ఎంపిక చేశారు. రిజ్‌ అహ్మద్‌, అల్లిసన్‌ విలియమ్స్‌ వ్యాఖ్యాతలుగా కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ‘లగాన్‌’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ కావడం గమనార్హం. అలాగే డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరిలో షానూక్‌సేన్‌ ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ నామినేట్‌ అయ్యాయి. 22 ఏళ్ల కిందట ‘లగాన్‌’ ఆస్కార్‌ తుది జాబితాలో నిలిచినా, అవార్డు దక్కలేదు. అయితే, ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’కు పనిచేసిన ఏ.ఆర్‌.రెహమాన్‌, రసూల్‌ పూకుట్టిలను ఆస్కార్‌ అవార్డులు వరించాయి.

ఉత్తమ చిత్రం..

  • అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
  • టాప్‌గన్‌: మావెరిక్‌
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
  • ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌
  • ఎల్విస్‌
  • ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
  • ది ఫేబుల్‌మ్యాన్స్‌
  • టార్‌
  • ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌
  • ఉమెన్‌ టాకింగ్‌

    ఉత్తమ దర్శకుడు..

  • మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
  • డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
  • స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
  • టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)
  • రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

    ఉత్తమ నటుడు

  • ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌)
  • కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)
  • బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
  • పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌)
  • బిల్‌ నిగీ (లివింగ్‌)

    ఉత్తమ నటి

  • కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌)
  • అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌)
  • ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)
  • మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
  • మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


ఒరిజినల్‌ సాంగ్‌

  • నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)
  • హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌)
  • లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌)
  • ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

    ఉత్తమ సహాయ నటుడు

  • బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
  • బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే)
  • జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
  • బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
  • కి హుయ్‌ క్వాన్‌  (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

    ఉత్తమ సహాయ నటి

  • ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌)
  • హాంగ్‌ చ్యూ (ది వేల్‌)
  • కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
  • జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
  • స్టెఫానీ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

    బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌

  • బేబీలాన్‌ (మ్యారీ జోఫెర్స్‌)
  • బ్లాక్‌పాంథర్‌: వకండా ఫరెవర్‌ (రూథ్‌కార్టర్‌)
  • ఎల్విస్‌( కేథరిన్‌ మార్టిన్‌)
  • ఎవ్రీథింగ్‌, ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ (షెర్లీ కురాట)
  • మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌ (జెన్నీ బియావాన్‌)

    బెస్ట్‌ సౌండ్‌

  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
  • అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌
  • ది బ్యాట్‌మెన్‌
  • ఎల్విస్‌
  • టాప్‌ గన్‌: మావరిక్‌

    స్క్రీన్‌ప్లే..

  • మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)
  • డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
  • స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, టోనీ కుష్నర్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)
  • టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)
  • రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ

  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జేమ్స్‌ఫ్రెండ్‌)
  • బార్డో, ఫాల్స్‌ క్రానికల్‌ ఆఫ్‌ ఏ హ్యాండ్‌ఫుల్‌ ఆఫ్‌ ట్రూత్స్‌ (డారియస్‌ కోహోన్‌డ్జీ)
  • ఎల్విస్‌ (మ్యాండీ వాకర్‌)
  • ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (రోగర్‌ డీకిన్స్‌)
  • టార్‌ (ఫ్లోరైన్‌ హాఫ్‌మెస్టర్‌)

ఉత్తమ ఎడిటర్‌..

  • మ్యాట్‌విల్లా, జోనాథన్‌ రెడ్మండ్‌ (ఎల్విస్‌)
  • పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
  • మోనికా విల్లీ (టార్‌)
  • ఎడీ హామిల్టన్‌ (టాప్‌గన్‌: మావరిక్‌)
  • మికెల్‌ ఇ. జి. నీల్సెన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌..

  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
  • అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)
  • క్లోజ్‌ (బెల్జియం)
  • ఇయో (పోలండ్‌)
  • ది క్వైట్‌ గాళ్‌ (ఐర్లాండ్‌)

డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌

  • ఆల్‌ దట్‌ బ్రెత్స్‌
  • ఆల్‌ ది బ్యూటీ అండ్‌ ది బ్లడ్‌షెడ్‌
  • ఫైర్ ఆఫ్‌ లవ్‌
  • ఏ హౌస్‌ మేడ్‌ ఆఫ్‌ స్ప్లింటర్స్‌
  • నావల్నీ

    యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌..

  • ది సీ బీస్ట్‌
  • టర్నింగ్‌ రెడ్‌
  • పస్‌ ఇన్‌ బూట్స్‌: ది లాస్ట్‌ విష్‌
  • గీలెర్మో దెల్‌ టోరోస్‌ పినాకియో
  • మార్సెల్‌ ది షెల్‌ విత్‌ షూస్‌ ఆన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని