Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
‘తెలిసి తెలిసి ఫ్లాప్ సినిమా తీయం కదా’ చాలా మంది దర్శకులు/నటులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాట. కావచ్చు.. కానీ, చూసిన కథలనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుడు కూడా చూడలేడు కదా!
ఇంటర్నెట్ డెస్క్: ‘తెలిసి తెలిసి ఫ్లాప్ సినిమా తీయం కదా’.. చాలా మంది దర్శకులు/నటులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాట ఇది. కావచ్చు.. కానీ, చూసిన కథలనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుడు కూడా చూడలేడు కదా! విభిన్న కథలతో కొందరు దర్శకులు సినిమాలు తీస్తుంటే.. మరికొందరు దర్శకులు/నటులు ఇంకా అవే పాత కథలకు కొత్త పెయింట్ వేసి వదిలేస్తున్నారు. ఒకప్పుడు కథ-కాకరకాయ లేకపోయినా స్టార్ హీరో అనే ట్యాగ్‌తో సినిమాలు సేల్ అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేక్షకుడికి అంత సమయం కూడా లేదు. సినిమా బాగుందా? లేదా?అంతే! మరి ఈ ఆర్నెల్ల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయిన సినిమాలివే!
భారీ అంచనాలతో విడుదలై..
అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi)ది 150 చిత్రాల అనుభవం. ఆయన చూడని ఎత్తు పల్లాలు లేవు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ‘ఆచార్య’(acharya) గుణపాఠమే చెప్పింది. తనయుడు రామ్‌చరణ్(Ram charan) నటించడం, కొరటాల శివ దర్శకత్వం వహించడం సినిమాపై అంచనాలను పెంచాయి. కానీ, ఆ అంచనాలను అందుకోలేక అటు దివ్య వనానికి ఇటు తీర్థజలానికి కాకుండా పాదఘట్టంలో ఉండిపోవాల్సి వచ్చింది. కొరటాల శివ(koratala siva) వరుస విజయాలకి బ్రేక్ పడింది. కథను నడిపించడంలో నిదానమే ప్రదానం అంటూ సాగే కొరటాల సినిమాలు ఇంతకు ముందు ఏదో ఒక సామాజిక సందేశంతో ప్రేక్షకుల దగ్గర మార్కులు వేయించేసుకున్నా ‘ఆచార్య’కి వచ్చేసరికి ఆ డొల్లతనం స్పష్టంగా బయటపడింది. ఇక ‘రాధేశ్యామ్’ (Radhe shyam) విషయానికొస్తే ప్రభాస్(Prabhas) హీరో.. పూజా హెగ్డే(pooja hegde) కథానాయిక.. వింటేజ్ లవ్ స్టోరీ.. విదేశాల్లో షూటింగ్ వెరసి మూవీపై అంచనాలు సినిమా చివరిలో కనిపించే షిప్ అంత కనిపించాయి. క్లైమాక్స్‌లో అదే షిప్ మునిగిపోయినట్లు సినిమా కూడా మెప్పించలేకపోయింది. ప్రభాస్ అనే స్టార్ ట్యాగ్ కూడా పనిచేయలేదు.
ఒకప్పుడు రవితేజ(Ravi teja) అంటే మినిమం గ్యారెంటీ హీరో. కానీ, రొటీన్ మాస్ సినిమాలతో ఆయన కూడా సగటు వెగటు సినిమాలను తీయడంతో వరుస ఫ్లాప్‌లు అందుకున్నారు. మధ్య ‘రాజా ది గ్రేట్’, ‘క్రాక్’లు ఉన్నా మళ్లీ ‘ఖిలాడీ’(Khiladi) అంటూ రొటీన్ మాస్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బాక్సాఫీస్వద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. ‘మహానటి’తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న కీర్తి సురేశ్(Keerthy suresh) కూడా ‘గుడ్ లక్సఖి’(GoodLuck Sakhi)తో ప్రేక్షకులను పలకరించినా.. ‘బ్యాడ్ లక్’ ఎదురైంది. విలక్షణ నటుడు మోహన్‌బాబు(Mohan babu) నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’(Son of india)ది అదే పరిస్థితి. తొలి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటాడని వరుణ్‌తేజ్‌కు మంచి పేరుంది. కానీ, ‘గని’ దెబ్బలో పసలేదు. అదే పాత చింతకాయ పచ్చడి. కాస్త తాలింపు, ఇంగువ వేసి వదిలారు.
మారితేనే మెచ్చుతారు..
కథా, కథనం అనేవి సినిమాకి గుండె లాంటివి. వాటిని సరిగ్గా అందించి, నడిపించినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఆధునికత జోడించడమూ అవసరమే. హై బడ్జెట్ హంగులు, మూస ఫార్ములాలు, పాన్ ఇండియా హోదాలు సినిమా విజయానికి ఉపకరిస్తాయే తప్ప విజయానికి ప్రధాన కారణం కావు. కథ పాతదే అయినా కొత్తగా, ఆకట్టుకునేలా కథనాన్ని మలిచి విజయాలను అందుకుంటున్నారు మరికొందరు దర్శకులు. మోతాదుకు మించని వైవిధ్యత ప్రదర్శించినప్పుడే సినిమా ప్రేక్షకుల మెప్పును పొందుతుంది. అవే అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి. 2022 అర్ధభాగంలో మంచి అంచనాలు ఏర్పడి వాటిని అందుకోలేకపోయిన చిత్రాలకు ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఈ జాబితాలో చిన్న హీరోలు/చిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది?