Cinema news: న్యూ మూవీ అప్‌డేట్స్‌ తారాజువ్వలు.. చిచ్చుబుడ్లు.. లక్ష్మీ బాంబులు ఇవే!

Tollywood: దీపావళి కానుకగా చిత్ర బృందాలు పంచుకున్న కొత్త పోస్టర్లు ఇవే!

Updated : 05 Nov 2021 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా భయాల నుంచి నెమ్మదిగా బయటపడుతున్న చిత్ర పరిశ్రమలో ఈ దీపావళి సరికొత్త వెలుగులు పంచుతోంది. థియేటర్‌లో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ దీపాల పండగకు ‘పెద్దన్న’, ‘ఎనిమి’, ‘మంచి రోజులు వచ్చాయి’ తదితర చిత్రాలు సందడి చేస్తుండగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లను ఆయా చిత్ర బృందాలు పంచుకున్నాయి. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూ, సరికొత్త పోస్టర్లు, టీజర్లు, సాంగ్‌ ప్రోమోలు, లిరికల్‌ వీడియోలు విడుదల చేశాయి.

* బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.


* రమేశ్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ(Ravi teja) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’(khiladi). మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ‘ఖిలాడి’ టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు


* చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’(acharya). రామ్‌చరణ్‌(Ram charan) కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌, పూజాహెగ్డే కథానాయికలు. ఇందులోని ‘నీలాంబరి’ పాటను చిత్ర బృందం పంచుకుంది. మణిశర్మ ఈ పాటకు సంగీతం అందించారు.


* గోపిచంద్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీఖన్నా కథానాయిక. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. టీజర్‌ను నవంబరు 8న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


* బాక్సింగ్‌ కింగ్‌ మైక్‌ టైసన్‌(Mike Tyson) భారతీయ వెండితెరపై సందడి చేసే సమయం ఆసన్నమైంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం ‘లైగర్‌’. దీపావళి సందర్భంగా మైక్‌ టైసన్‌ పిడికిలి బిగించిన పోస్టర్‌ను విడుదల చేశారు.


దీపావళి కానుకగా చిత్ర బృందాలు పంచుకున్న కొత్త పోస్టర్లు ఇవే!


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని