waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
waltair veerayya: చిరంజీవి, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది.
హైదరాబాద్: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya ott release date) చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న రెండో చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. అజిత్ నటించిన ‘తునివు’ కూడా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌వేదికగానే స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ విషయానికొస్తే శుత్రిహాసన్ కథానాయికగా నటించిన ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషించారు.
కథేంటంటే: సముద్రం ఆనుపానులు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య (చిరంజీవి) (Chiranjeevi). అవసరమైనప్పుడు నేవీ అధికారులకి కూడా సాయం చేస్తుంటాడు. పోర్ట్‌లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరుమీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల పోలీస్ అధికారి సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సాల్మన్‌ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగిన వాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం రూ. 25 లక్షలకి ఇద్దరి మధ్యా ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సాల్మన్ సీజర్‌తోపాటు, అతని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాశ్‌రాజ్)కి ఎర వేస్తాడు. ఇంతకీ మైఖేల్‌కీ, వీరయ్యకీ సంబంధం ఏమిటి? (Waltair Veerayya review) నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్‌సాగర్ (రవితేజ) గతమేమిటి? మైఖేల్‌పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ.
‘వాల్తేరు వీరయ్య’ పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్‌నేమ్ కూడా పెట్టారట..!
-
General News
మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టి.. కాల్వలో ఈతకొట్టి.. చుక్కలు చూపించిన టిప్పర్ డ్రైవర్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Millet man: ‘తెలంగాణ మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ ఇక లేరు
-
World News
Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’
-
Politics News
Sajjala: ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోంది: సజ్జల