Aryan Khan: బాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సిన సమయంలో..

అతడి తండ్రి సూపర్‌ స్టార్‌.. విజయవంతమైన సినీ నిర్మాత.. బిజినెస్‌ మాగ్నెట్‌..! ఈ నేపథ్యంలో అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీఇవ్వడం దాదాపు ఖరారైంది. అదే సమయంలో అనుకోని విధంగా రేవ్‌పార్టీ కేసులో అతని

Updated : 03 Oct 2021 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అతడి తండ్రి సూపర్‌ స్టార్‌.. విజయవంతమైన సినీ నిర్మాత.. బిజినెస్‌ మాగ్నెట్‌..! ఈ నేపథ్యంలో అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారైంది. అదే సమయంలో అనుకోని విధంగా రేవ్‌పార్టీ కేసులో అతని పేరు బయటకు వచ్చింది. అతడే షారుఖ్‌ ఖాన్‌-గౌరీ ఖాన్‌ల పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌..! ప్రస్తుతం మాదకద్రవ్యాల నిరోధక శాఖ అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.

షారుఖ్‌-గౌరీలకు 1997లో తొలి సంతానంగా ఆర్యన్‌ ఖాన్‌ పుట్టాడు. మీడియాకు కొంత దూరంగానే షారుఖ్‌ తన కుమారుడిని పెంచాడు. ప్రస్తుతం ఆర్యన్‌కు 23 ఏళ్లు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఇతని ఫాలోవర్ల సంఖ్య 14లక్షలకు పైమాటే.

ఆర్యన్‌ లండన్‌లోని సెవెన్‌వోక్స్‌లో పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు. ఈ ఏడాది మొదట్లో యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌, సినిమాటిక్‌, ఫిల్మ్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని సొంతం చేసుకొన్నాడు. సెలబ్రిటీ సర్కిల్‌లో ఫిట్‌నెస్‌ అంటే ఇష్టపడే వ్యక్తిగా ఆర్యన్‌ అందరికీ తెలుసు. ఇప్పటికే తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ సాధించాడు. 2010లో మహారాష్ట్రలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆర్యన్‌కు బంగారు పతకం వచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ల బిడ్డలైన షానయా కపూర్‌, అనన్యా పాండే, ఆహాన్‌ పాండే, నవ్యా నవేలీ నందా వంటి వారితో తరచూ కనిపిస్తుంటారు. 

ఆర్యన్‌ 2001లోనే ‘కభీ ఖుషీ కభీగమ్‌’ చిత్రంలో జూనియర్‌ షారుఖ్‌ ఖాన్‌ పాత్ర పోషించాడు. 2006లో విడుదలైన కబీ అల్విదా నా కెహ్నా చిత్రంలో కూడా సాకర్‌ ఆడుతున్న బాలుడిగా ఆర్యన్‌ కనిపించే సీన్‌ ఉంది. కానీ, ఎడిటింగ్‌లో దీనిని తొలగించారు. 2004 విడుదలైన యానిమేషన్‌ చిత్రం ‘ఇంక్రెడిబుల్స్‌’లో చిన్నారి తేజ్‌ పాత్రకు గాత్రాన్ని ఇచ్చాడు. హిందీ వెర్షన్‌ లయన్‌ కింగ్‌లో సింబా పాత్రకు కూడా స్వరాన్ని ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని