
Dhanush-Aishwaryaa: హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులవిడాకులు
చెన్నై: తమిళ హీరో ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు ఉమ్మడి లేఖను విడివిడిగా సామాజిక మాధ్యమాల్లోప్రకటించారు. ‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’’ అని ధనుష్ ట్విటర్లో ఉంచిన లేఖలో పేర్కొన్నాడు.
మరోవైపు ఐశ్వర్య సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదే లేఖను పోస్టు చేశారు. ఈ లేఖకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని ఐశ్వర్య పేర్కొంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఐశ్వర్య పెద్దకూతురు. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.