Ram: ‘జీవితం ముఖ్యమా? సినిమా ముఖ్యమా’ అన్నారు: హీరో రామ్
‘ది వారియర్’ విడుదల సందర్భంగా కథానాయకుడు రామ్పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: హీరోలలో ఎనర్జిటిక్ స్టార్(Energetic Star) ‘రామ్’(Ram Pothineni)కి ఉండే క్రేజ్ వేరు. అభిమానులు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు తన ఆహార్యాన్ని మార్చుకుంటూ, విభిన్నపాత్రలతో మెప్పిస్తాడు. గతేడాది విడుదలైన ‘రెడ్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్ ఇప్పుడు ‘ది వారియర్’(The Warrior)తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. లింగుస్వామి(Lingusamy) దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో జులై14న విడుదలవనున్న ఈ చిత్ర విశేషాలను రామ్ మీడియాతో పంచుకున్నారు. అవేంటో చూసేద్దాం.
సడెన్‌గా పోలీస్ రోల్లో కనిపించారు కారణమేంటి?
రామ్: అసలు పోలీస్ కథలపై నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేద్దామనుకున్నా. రొటీన్ స్టోరీలు వచ్చేసరికి బోర్ కొట్టి వద్దనుకున్నాను. లింగుస్వామి వచ్చి కథ చెప్పడానికి ముందు పోలీస్‌స్టోరీ అనేసరికి షాక్ అయ్యా. సరే కథ విని నో చెప్పేద్దామనుకున్నాను. కానీ, ఆయన చెప్పిన కథ నాకే ఎనర్జీ ఇచ్చింది. నేను ఎదురుచూస్తున్న రోల్ ఇదేనని ఓకే చెప్పేశా.
రెగ్యులర్ పోలీస్ కథలకి భిన్నంగా ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు?
రామ్: ఇది రియల్ స్టోరీ నుంచి స్ఫూర్తి పొందిన కథ. నాకు దర్శకుడు కథ చెప్పడం పూర్తయ్యాక, ఈ విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇంత పవర్ఫుల్ రోల్‌ని ఇంకా థ్రిల్లింగ్‌గా డిజైన్ చేశారు లింగుస్వామి. ఎంతలా అంటే స్టోరీ చెప్పిన అరగంటకే మా ఇంటికి పోలీస్ యూనిఫామ్ రప్పించుకున్నా. యూనిఫామ్ ఒంటిపై పడగానే ఏదో పవర్ ఉందనిపించింది.
విలన్‌గా చేసిన ఆది పినిశెట్టి పాత్ర ఎలా ఉంటుంది?ఆయన్ని ఎవరు ఎంపిక చేశారు?
రామ్: స్టోరీ వినగానే గురు(విలన్ రోల్) పాత్ర ఎవరు చేస్తున్నారు?అని ఆసక్తిగా అడిగాను. సినిమాకి చాలా బలమైన రోల్ అది. ‘ఆది పినిశెట్టి’(Aadi Pinisetty) అనగానే సూపర్ అనుకున్నాను. ఆది కూడా చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. అతనూ ఈ స్క్రిప్టు వినగానే రెడీ అన్నాడట.అది స్టోరీకున్న బలం.
మీ సినిమాని థియేటర్లో విడుదల చేస్తున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ అనిపించట్లేదా?
రామ్: తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ప్రేమిస్తారు. కరోనా తరువాత కూడా థియేటర్లని నిలబెట్టింది మనవాళ్లే. థియేటర్లో చూడాలనుకునే సినిమాని అక్కడ చూడటానికే ఇష్టపడతారు. వారికి నచ్చితే భారీ విజయాన్ని అందిస్తారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ విజయాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూడటానికే వారు ఇష్టపడతారు. ఈ సినిమాలో ప్రతి సీన్ థియేటర్లో ఎంజాయ్ చేసే రేంజ్లో ఉంటుంది.
సినిమా షూటింగ్ దశలో ఉండగా మీకేదో ఆరోగ్య సమస్య వచ్చిందట?
రామ్: అవును.. జిమ్‌లో ఎక్కువ సమయం గడపటం వల్ల శరీరంలో గాయమైంది. వెన్నెముకకు చిన్న సర్జరీ జరిగింది. ఒక్కసారిగా షూటింగ్‌కి బ్రేక్. ఆ సమయంలోనే ఆది పెళ్లి కూడా. ఇంకెంత కాలం విశ్రాంతి తీసుకోవాలి, షూటింగ్‌కి అటెండ్ అవ్వాలని డాక్టర్ని అడిగా. ఆయన ‘మీకు సినిమా ముఖ్యమా?జీవితం ముఖ్యమా’ అని అడిగారు. ఆలోచించుకుంటే సినిమానే జీవితం అనిపించింది. అందుకే ఇలా వచ్చేశాను. ప్రస్తుతం ఏ సమస్యా లేదు.
ఈ మధ్య సోషల్‌మీడియా ద్వారా పబ్లిక్ విషయాల్లో ఎక్కువగా స్పందిస్తున్నారు?
రామ్: అవునండీ. స్పందించాలి కదా! ముఖ్యంగా కచ్చితంగా చెప్పాల్సిన విషయంలో చెప్పి తీరాలి. అందుకే స్పందిస్తున్నా.
హీరోయిన్గా కృతిశెట్టి(Krithi Shetty)ని తీసుకున్నారు? దానికి కారణం?
రామ్: ఆమె చాలా కష్టపడుతుంది. సినిమా అంటే అభిమానం.. గౌరవం. అందువల్లే ఈ రోల్‌కి సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుంది.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, శింబుతో పాట పాడించడం ఇవన్నీ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి?
రామ్: దేవీతో ఇది అయిదో సినిమా. తనతో నా ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. ఇప్పుడు ఈ సినిమా పాటలు అదే స్థాయిలో వినపడుతున్నాయి. తమిళ్ లో అయితే బులెట్ సాంగ్ ట్రెండ్ కొనసాగుతోంది. శింబు వాయిస్‌లో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది కూడా ఆ పాటకు ఎనర్జీ ఇచ్చింది.
తరువాత సినిమా బోయపాటితో కదా? పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట?
రామ్: అవును. అది పాన్ ఇండియా సినిమానే. బోయపాటి సినిమాను చాలా శ్రద్ధ పెట్టి తీస్తారు. ప్రతీ సన్నివేశాన్ని బాగా గమనిస్తారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో అంటే ఇంకా బాగా తీస్తారని ఆయనపై నమ్మకం.
ఈ మధ్యకాలంలో మీ పెళ్లిపై రూమర్లు ఎక్కువయ్యాయి..దీనికి మీ సమాధానం?
రామ్: అవును(నవ్వుతూ..) ప్రస్తుతం దానిపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య రూమర్లపై రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే. నేనసలు స్కూలుకే సరిగ్గా వెళ్లలేదు. ఇక స్కూల్ గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడుంటుంది?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు?మళ్లీ లవ్స్టోరీలెప్పుడు?
రామ్: ప్రస్తుతం యాక్షన్ సినిమాలే ఎక్కువగా కిక్కిస్తున్నాయి. మళ్లీ లవ్‌స్టోరీలు చేయాలనిపించినపుడు అవీ చేస్తాను. ‘వారియర్’ తర్వా బోయపాటి సినిమాపైనే దృష్టి పెట్టా. హరీశ్ శంకర్, అనిల్ రావిపూడితో సినిమాలు ఇంకా చర్చల దశల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట