Sharwanand: నేను క్షేమంగా ఉన్నా.. రోడ్డు ప్రమాదంపై శర్వానంద్ ట్వీట్
హీరో శర్వానంద్ (Sharwanand) కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే తాను క్షేమంగానే ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: హీరో శర్వానంద్ (Sharwanand) కారు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఆయన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానంటూ తాజాగా శర్వానంద్ ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు ఉదయం నా కారుకు యాక్సిడెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే అది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల నేను క్షేమంగా ఉన్నాను. నా గురించి చింతించకండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ఆయన రాసుకొచ్చారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తనిఖీల్లో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్ కారులోనే ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. మరోవైపు, ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు గాయాలయ్యాయంటూ ప్రచారం జరిగింది. దీంతో, తాజాగా ఆయన స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ