Cinema News: మహేశ్‌ చేతుల మీదుగా ‘హీరో’

గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న.....

Published : 23 Jun 2021 14:14 IST

హైదరాబాద్‌: గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అశోక్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను బుధవారం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేశారు. ఇందులో అశోక్‌.. కౌబాయ్‌, జోకర్‌ గెటప్పుల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

విభిన్నమైన లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అశోక్‌కు జంటగా నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, వెన్నెల కిషోర్‌, నరేష్‌, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని