Laatti: ‘లాఠీ’ ఒక టికెట్‌కు రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను..: విశాల్
పందెంకోడి సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విశాల్. ఈ టాలెంటెడ్ హీరో తాజా చిత్రం ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: విశాల్ హీరోగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా మాట్లాడుతూ విశాల్‌ను తనదైన శైలిలో ప్రశంసించారు.
‘‘అందరూ విశాల్ గురించి గొప్పగా మాట్లాడారు. నేను సరదాగా తనకు ఉన్న ఓ చెడ్డ లక్షణం గురించి చెబుతాను. సినిమా కథ ఎంత బడ్జెట్ అయిన, షూటింగ్ ఎన్ని రోజులైనా విశాల్ చేస్తూనే ఉంటాడు. ఈ లక్షణం ఒక జబ్బుతో సమానం. ఇది మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కు అంటుకుంది(నవ్వుతూ). రాజమౌళి ఎలా అయితే విజయాన్ని అందుకున్నాడో.. విశాల్ కూడా అలానే సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఈవెంట్స్‌కు చాలా తక్కువగా హాజరవుతాను. ఇటీవల ‘కార్తికేయ2’ ఈవెంట్‌కు వెళ్లాను. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ ‘లాఠీ’ సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను’’ అంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఇక విశాల్ మాట్లాడుతూ తన కటౌట్‌లను ఏర్పాటుచేసి, తనకు బొకేలు లాంటివి ఇవ్వదన్నారు. ఆ డబ్బులతో చిన్నపిల్లలకు సహాయం చేయాలని తన ఫ్యాన్స్‌ను మరోసారి కోరారు. ‘‘నేను జీవితంలో చాలా కిందస్థాయిలో ఉండే కష్టాలను చూశాను. అలాగే గొప్ప వాళ్లు పొందే ఆనందాన్నీ చూశాను. స్కూల్, కాలేజీల్లో చెప్పే పాఠాల కంటే సినిమా నేర్పించే పాఠాలు చాలా గొప్పవి. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. నా దగ్గరకు వచ్చి ఎవరైనా కథ రికమెండ్ చేస్తే.. అది బాగుంటే వెంటనే వాళ్లని కౌగిలించుకుంటాను. నచ్చకపోతే లోపలికి పిలిచి తలుపులు వేసి మరీ వాళ్లని కొడతాను(నవ్వుతూ..). కానీ ‘లాఠీ’ కథ నాకు చాలా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాను ఎంత మంది చూస్తారో ఆ డబ్బుల్లో.. ఒక టికెట్‌కు ఓ రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అంటూ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ సినిమా చూడాలని విశాల్ కోరారు. ఇక విజయేంద్రప్రసాద్ గారిని కలవాలన్నది తన కోరిక అని.. ఆయన ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!