Vishnu Vishal: ఆ విషయంలో జ్వాల ఇప్పటికీ పశ్చాత్తాపపడుతూనే ఉంది: విష్ణు విశాల్‌

నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal). ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మట్టికుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. డిసెంబరు 2న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో విష్ణు విశాల్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

Published : 26 Nov 2022 23:45 IST

ప్రేమించిన అమ్మాయి ఇష్టమా? పెళ్లయిన అమ్మాయి ఇష్టమా? అంటే చెప్పటం కష్టమని, అలా తాను క్రికెటర్‌ అయిన తర్వాత సినిమాల్లోకి వచ్చానని అన్నారు నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal). ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మట్టికుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

అసలేంటీ ‘మట్టి కుస్తీ’..?

విష్ణు విశాల్‌: ‘మట్టి కుస్తీ’ భార్య భర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా ఉంటుంది. పెళ్లి తర్వాత భార్యభర్తలకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలవుతాయి. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

క్రీడా నేపథ్యం కూడా ఉంటుందా?

విష్ణు విశాల్‌: ఇందులో చాలా సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను కబడ్డీ ప్లేయర్ ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తా. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో.. సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. ‘వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ, రెండు అబద్ధాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అని డైలాగ్ ఉంటుంది. ఆ రెండు అబద్ధాలు ఏంటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది.

భార్యభర్తల నేపథ్యం అంటే హాస్యానికి కూడా అవకాశం ఉంటుంది కదా!

విష్ణు విశాల్‌: ‘మట్టికుస్తీ’లో కూడా చాలా కామెడీ ఉంది. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు కచ్చితంగా ఇగో ఉంటుంది. అయితే ఇందులో ఆడ మగ సమానమని చెప్పే సందేశం కూడా ఉంది. అయితే దీన్ని ఒక సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళ ప్రేక్షకులు కూడా మట్టికుస్తీని చాలా ఇష్టపడతారు.

రవితేజ ఈ చిత్రంలో ఎలా భాగమయ్యారు?

విష్ణు విశాల్‌: ‘ఎఫ్ఐఆర్’ని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌ ద్వారా రవితేజను కలిశా. నేను చేసే సినిమాలు ఆయనకు చాలా నచ్చాయి. ‘ఎఫ్ఐఆర్’ ట్రైలర్ నచ్చి ఆ సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఈ మూవీ గురించి చెప్పా. నిర్మాణంలో ఆయన భాగం అవుతానని చెప్పారు.అలా మా జర్నీ మొదలైయింది.

మీరు మొదట క్రికెటర్! తర్వాత యాక్టర్ అయ్యారు. వీటిల్లో ఏది ఇష్టం?

విష్ణు విశాల్‌: ప్రేమించిన అమ్మాయి ఇష్టమా?పెళ్లి చూసుకున్న అమ్మాయి ఇష్టమా? అంటే ఏం చెబుతాం(నవ్వుతూ). క్రికెట్‌ని ప్రేమించాను. సినిమాని పెళ్లి చేసుకున్నాను. రెండూ ఇష్టమే. అవకాశం వస్తే, క్రికెటర్‌గా చేయాలని ఉంది.

జ్వాల, మీరు కలిసి నటించే అవకాశం ఉందా?

విష్ణు విశాల్‌: జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది. అయితే తనకి నటన పట్ల ఆసక్తి లేదు. ఇది వరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఫీలౌతుంటుంది. ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దని చెప్పింది( నవ్వుతూ) ప్రస్తుతం నా నిర్మాణంలో మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్‌దాస్ చిత్రం చిత్రీకరణలో ఉంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ ‘లాల్ సలాం’ చిత్రంలో నటిస్తున్నా.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని