ఐలవ్‌యూ చెప్పిన అభిమాని.. స్పందించిన నటి

సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడం.. వాటికి నెటిజన్లు కమెంట్లు చేయడం మామూలే. అయితే.. అన్నిసార్లు కాకపోయినా.. కొన్నిసార్లు తమ పోస్టులకు వచ్చిన కమెంట్లపై సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

Updated : 08 Feb 2021 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడం.. వాటికి నెటిజన్లు కామెంట్‌ చేయడం మామూలే. అయితే.. అన్నిసార్లూ కాకపోయినా.. కొన్నిసార్లు తమ పోస్టులకు వచ్చిన కామెంట్లపై సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, మాళవిక మోహనన్‌ జంటగా ఓ సినిమా వస్తోంది. కార్తీక్‌ నరేన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొంతకాలంగా రాత్రింబవళ్లూ తీరికలేకుండా హైదరాబాద్‌లో చిత్రీకరణ పనులు సాగుతున్నాయి. కాగా.. ఆ షెడ్యూల్‌ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ మాళవిక అభిమానులతో పంచుకుంది. ధనుష్‌తో కలిసి సినిమా సెట్లో దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసింది.

‘ధనుష్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మీతో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నా. మీ నవ్వులు మిస్‌ అవుతున్నా. తర్వాతి షెడ్యూల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మనిద్దరం మ్యాగీ ప్రేమికులం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే.. ఆ పోస్టుకు స్పందనగా హీరోయిన్‌ను ఉద్దేశిస్తూ ‘ఐలవ్‌యూ మ్యాగీ’ అని ఒక అభిమాని కామెంట్‌ చేయగా.. దానికి ఆ హీరోయిన్‌ స్పందించింది. ‘మాగీని ప్రేమించేవాళ్లందర్నీ నేను ఇష్టపడతాను’ అంటూ ఆమె తనదైన స్టైల్‌లో సరదాగా స్పందించింది. ఇటీవల మాళవిక నటించిన మాస్టర్‌ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

ఉప్పెన నుంచి స్పెషల్‌ సాంగ్‌

‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని