Madhavi latha: నేను పెళ్లికి సిద్ధంగా లేను.. వైరలవుతోన్న మాధవీలత పోస్ట్
హీరోయిన్ మాధవీలత (Madhavi latha) పెళ్లిపై పోస్ట్ పెట్టారు. తాను ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు.
హైదరాబాద్: ‘నచ్చావులే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైయ్యారు నటి మాధవీలత (Madhavi latha). ఆ తర్వాత ‘స్నేహితుడు’, ‘అరవింద్ 2’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు.
తాజాగా కొందరు నెటిజన్లు ఆమెను ట్యాగ్ చేస్తూ మీ పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమేనా.. పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ పొస్టులు పెట్టారు. వాళ్లకు మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వయసు ఒక్కటే సరిపోదు. దానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. అది పూర్తిగా ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను పెళ్లికి సిద్ధంగా లేను. భవిష్యత్తులోనూ చెప్పలేను. ఇది నా జీవితం.. నేనే నిర్ణయం తీసుకుంటాను’’ అని చెప్పింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా కామెంట్లలో స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం కాస్త సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవీలత తను యాక్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఆర్టిస్టులకు నవ్వుతూ నటిస్తున్నంత మాత్రన వాళ్లకు కష్టాలు లేవని చాలామంది అనుకుంటారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?
-
Raviteja: ఆ పదాన్ని వాడడం మానేయాలని అభ్యర్థిస్తున్నా: రవితేజ
-
Vivo mobiles: 50MP సెల్ఫీ కెమెరాతో వీవో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!