గ్లామర్‌ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు

అందం, అభినయంతో ఒకానొక సమయంలో వెండితెర వేదికగా ప్రేక్షకులకు చేరువై.. ఉన్నట్టుండి తెలుగు సినిమాలకు దూరమైన పలువురు నటీమణులు ఇప్పుడు నెట్టింటి వేదికగా అభిమానుల్ని ఫిదా చేస్తున్నారు. గ్లామర్‌ ఫొటోలు...

Published : 26 Feb 2021 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అందం, అభినయంతో ఒకానొక సమయంలో వెండితెర వేదికగా ప్రేక్షకులకు చేరువై.. ఉన్నట్టుండి తెలుగు సినిమాలకు దూరమైన పలువురు నటీమణులు ఇప్పుడు నెట్టింట అభిమానుల్ని ఫిదా చేస్తున్నారు. గ్లామర్‌ ఫొటోలు, వీడియోలతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతూ ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. అలా, ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల మది దోచిన కొంతమంది తారలపై ఓ లుక్కేయండి..!

ఖుషీ చేస్తోన్న గోవా బ్యూటీ

‘దేవదాసు’తో మొదటి ప్రయత్నంలోనే హిట్‌ సొంతం చేసుకున్నారు గోవా బ్యూటీ ఇలియానా. కెరీర్‌ ప్రారంభంలోనే ‘పోకిరి’ లాంటి సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పలువరు అగ్ర, యువ హీరోల సరసన నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లతో అక్కడి వారినీ అలరించారు. 2018లో విడుదలైన ‘అక్బర్‌ అమర్‌ ఆంటోనీ’ తర్వాత ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తరచూ తన ఫొటోలతో అభిమానుల్ని ఖుషీ చేస్తున్నారు.

అందంతో మెప్పిస్తూ..

‘మొదటి సినిమా’తో తెలుగువారికి పరిచయమైన ముంబయి ముద్దుగుమ్మ పూనమ్‌ బాజ్వా. ‘బాస్‌’, ‘పరుగు’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ఆ తర్వాత మలయాళీ, తమిళ ఇండస్ట్రీల వైపు ఈ నటి అడుగులు వేశారు. అలా, దాదాపు 11 సంవత్సరాల తర్వాత 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో ఆమె ఓ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ నటి మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు.

‘నిషా’ కళ్ల చిన్నది

అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ సోదరిగా ఎంట్రీ ఇచ్చిన నిషా అగర్వాల్‌ కెరీర్‌ ఆరంభంలోనే ‘సోలో’తో ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఆమె కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. 2013లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన నిషా తాజాగా గత కొన్నిరోజుల నుంచి గ్లామర్‌ ఫొటోషూట్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

వావ్‌ ఆదా..!

‘1920’ అనే హిందీ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘హార్ట్‌ ఎటాక్‌’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘గరం’, ‘క్షణం’, ‘కల్కి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ లాంటి తెలుగు చిత్రాల్లో తళుక్కున మెరిశారు. ఇటీవల సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ ఈ ముద్దుగుమ్మ నెట్టింటి వేదికగా తరచూ వీడియోలు, ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్నారు.

‘చిరుత’ భామ

‘చిరుత’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నటి నేహా శర్మ. ప్రస్తుతం హిందీ, మలయాళీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ వెబ్‌సిరీస్‌ల్లో సైతం ఈ బ్యూటీ తళుక్కున మెరుస్తున్నారు. ఇటీవల ఆమె షేర్‌ చేసిన కొన్ని వీడియోలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

‘లెజెండ్‌’ బ్యూటీ

‘లెజండ్‌’తో తెలుగు వారిని అలరించిన భామ సోనాల్‌ చౌహాన్‌. ఆ సినిమా తర్వాత ఆమె ‘రూలర్‌’, ‘డిక్టేటర్‌’లలో బాలయ్య సరసన నటించారు. ప్రస్తుతం ‘ది పవర్‌’ అనే హిందీ సినిమాలో నటిస్తున్న ఈ నటి తాజాగా నెట్టింటి వేదికగా కొన్ని గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేశారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని