Heroines: ఆనాటి తారల అసలు పేర్లేంటో తెలుసా!

అలనాటి తారలు తమ అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఆ తారల అసలు పేర్లేంటో తెలుసా!

Updated : 24 Sep 2022 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాటి తారలు తమ అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఆ తారల అసలు పేర్లేంటో తెలుసా!

జయసుధ..
మద్రాసులో జన్మించిన జయసుధ సహజ నటిగా తెలుగు సినీరంగంలో పేరొందారు. ఈమె అసలు పేరు సుజాత.


జయప్రద
1962 ఏప్రిల్ 3న  రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. తెలుగు సినీరంగంలో ప్రవేశించిన తర్వాత జయప్రదగా పేరు మార్చుకున్నారు. 


శ్రీదేవి
తమిళనాడులో జన్మించిన శ్రీదేవి బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్‌ అయ్యప్పన్. 


జీవితా రాజశేఖర్‌..

తలంబ్రాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా నటించిన జీవిత స్వస్థలం శ్రీశైలం. తన అసలు పేరు పద్మ. ఆమెను ఇంట్లో అందరూ పెద్ద పద్మ, పెద్ద బొట్టు పద్మ అని పిలిచేవాళ్లు!


సౌందర్య..
తన నటనతో తెలుగు ప్రజలతో మన తెలుగింటి అమ్మాయి అనిపించుకున్నారు సౌందర్య. 100 సినిమాలకు పైగా నటించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీరంగ ప్రవేశం కోసం తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు. 


ఆమని..
నెల్లూరులో జన్మించిన ఈ నటి అసలు పేరు మంజుల. జంబలకిడిపంబ సినిమాతో ఆమని తెలుగు సినీరంగ ప్రవేశం చేశారు. 


రోజా..
రోజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి.


రంభ..
విజయవాడలో పుట్టిన ఈ నటిని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి.


రాశి..
చెన్నైలో జన్మించిన నటి రాశి అసలు పేరు విజయలక్ష్మి, మంత్ర అని కూడా పిలుస్తుంటారు. ఈమె బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. 


భూమిక 
భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా.  గుడియా అని కూడా పిలుస్తుంటారు. యువకుడు సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఖుషీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని