Tollywood: హిట్టు కొట్టాల్సిందే!
చిత్రసీమలో ప్రతిభ కంటే విజయాలే కీలకం. ఎవరికి ఎక్కువ విజయాలు ఉంటే వాళ్లనే అవకాశాలు వరిస్తుంటాయి. మార్కెట్ సమీకరణాలే అంత! ఒక్క విజయంతో ఆయా తారలకి బోలెడంత మైలేజీ లభిస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ విజయం కోసమే పరితపిస్తుంటారు.
చిత్రసీమలో ప్రతిభ కంటే విజయాలే కీలకం. ఎవరికి ఎక్కువ విజయాలు ఉంటే వాళ్లనే అవకాశాలు వరిస్తుంటాయి. మార్కెట్ సమీకరణాలే అంత! ఒక్క విజయంతో ఆయా తారలకి బోలెడంత మైలేజీ లభిస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ విజయం కోసమే పరితపిస్తుంటారు. ఎంత మంచి అవకాశం దక్కించుకున్నా... టన్నులకొద్దీ ప్రతిభని ప్రదర్శించినా... కొన్నిసార్లు విజయాలు మొహం చాటేస్తుంటాయి. అలాంటి కొద్దిమంది కథానాయికలకి రానున్న సెప్టెంబర్ మాసం కీలకంగా మారింది. పరాజయాలతో సతమతమవుతున్న పలువురు భామలు ఈ నెలలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ఈసారైనా విజయం దక్కేనా?
చిత్రసీమలో అవకాశాలు ఎంత ముఖ్యమో... వాటిని నిలబెట్టుకోవడం అంతే ముఖ్యం. అందుకే కాస్త నిలదొక్కుకున్నాక ప్రతి ఒక్కరూ మంచి కథల్ని ఎంపిక చేసుకోవడంపైనే దృష్టిపెడుతుంటారు. ఆచితూచి అడుగులు వేస్తుంటారు. రీతూవర్మ, నివేదా థామస్, రెజీనా... వీళ్లంతా ఆ రకమే. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించడానికే ఇష్టపడుతుంటారు. నటులుగా ప్రతిభావంతులు అనే పేరు తెచ్చుకున్నా వీళ్లకి ఈమధ్య తెలుగులో ఆశించిన స్థాయి ఫలితాలు లేవు. ‘శాకిని ఢాకిని’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రెజీనా, నివేదా థామస్. కొరియన్ చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. అక్కడ అబ్బాయిలతో తెరకెక్కగా, తెలుగులో అమ్మాయిలు ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. రెజీనా, నివేదా థామస్‌కి కీలకమైన ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి. తెలుగమ్మాయి రీతూ వర్మ కూడా ప్రతిభగల నటి. ఈమధ్య ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటించింది. అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. వచ్చే నెలలో ‘ఒకే ఒక జీవితం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమె కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే ఈ సినిమానే కీలకం. ప్రస్తుతం రీతూ చేతిలో సినిమాలేమీ లేవు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మళ్లీ జోరు పెంచుతుందేమో చూడాలి.
* తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది కృతిశెట్టి. ఆమెకి అవకాశాలకి కొదవలేదు. అగ్ర కథానాయకులకి జోడీగా నటిస్తోంది. అయితే ‘ఉప్పెన’ తర్వాత ఆ స్థాయి విజయం కృతిశెట్టికి దక్కలేదు. ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’తో సందడి చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. వచ్చే నెలలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధీర్‌బాబుకి జోడీగా నటించింది కృతిశెట్టి. మరి ఈ ప్రేమ కథతో ఆమె మళ్లీ ఫామ్ అందుకుంటుందేమో చూడాలి. దిల్లీ భామ కేతికశర్మకి అవకాశాలకి కొదవలేదు. ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, నాగశౌర్యతో కలిసి ‘లక్ష్య’లోనూ మెరిసింది. ఇప్పటిదాకా విజయం రుచి చూడని ఈమె, ‘రంగ రంగ వైభవంగా’ అంటూ వైష్ణవ్‌తేజ్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకొస్తోంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమా కేతికశర్మకి చాలా ముఖ్యం. మరిన్ని అవకాశాలు అందుకోవాలంటే హిట్ భామ అనిపించుకోవల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాఖీభాయ్ లుక్‌లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్‌తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్‌ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!