
Published : 18 Jan 2022 20:12 IST
Hey Jude: త్రిష తొలి మలయాళ చిత్రం ఇక ‘ఆహా’లో..!
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగుతో పాటు, తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష. అయితే, చాలా ఆలస్యంగా ఆమె మలయాళంలో అడుగుపెట్టారు. నివిన్ పౌలితో కలిసి ఆమె నటించిన చిత్రం ‘హే జూడ్’. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు. 2018లో విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు, ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీలో ‘ఆహా’ సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ తెలిపింది.
Advertisement
Tags :