Published : 20 Jan 2022 20:21 IST

Hey Jude: నివిన్‌ పౌలి, త్రిష నటించిన‘హే జూడ్‌’ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: సత్పవర్తన కలిగిన యువకుడిగా.. అమ్మాయి మనసు దోచే అమాయకపు వ్యక్తిగా... ‘హే జూడ్‌’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు మలయాళీ నటుడు నివిన్‌ పౌలి. ‘ప్రేమమ్‌’, ‘బెంగళూర్‌ డేస్‌’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు నివిన్‌ సుపరిచితుడే. తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిషకి ఇదే తొలి మలయాళీ చిత్రం. శుక్రవారం ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంటిక్‌- కామెడీ జానర్‌లో దర్శకుడు శ్యామ్‌ ప్రసాద్‌ తెరకెక్కించారు. 2018 ఫిబ్రవరి 2న మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు గోపీ సుందర్‌,  రాహుల్‌ రాజ్‌, ఊసేప్పచాన్, ఎం. జయచంద్రన్‌ పనిచేయడం విశేషం. మరి అమాయకపు జూడ్‌ నివిన్‌, యాక్టివ్‌ అమ్మాయిగా కనిపించిన త్రిషతో కలిసి ఎలా అలరించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని