Hey Sinamika: ఓటీటీలోకి ‘స్టాండప్‌ రాహుల్‌’, ‘హే సినామిక’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్లలో ఇటీవల విడుదలై అలరించిన ‘స్టాండప్‌ రాహుల్‌’, ‘హే సినామిక’ చిత్రాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.

Published : 30 Mar 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్లలో ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన ‘స్టాండప్‌ రాహుల్‌’, ‘హే సినామిక’ చిత్రాలు త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ‘హే సినామిక’.. ‘జియో సినిమా’, ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ నెల 31  నుంచి; ‘స్టాండప్‌ రాహుల్‌’.. ‘ఆహా’లో ఏప్రిల్‌ 8 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి. రాజ్‌తరుణ్‌ హీరోగా శాంటో మెహన వీరంకి తెరకెక్కించిన చిత్రమే ‘స్టాండప్‌ రాహుల్‌’. స్టాండప్‌ కమెడియన్‌గా రాజ్‌తరుణ్‌, ఆయన ప్రేయసిగా వర్ష బొల్లమ్మ ప్రేక్షకులకు నవ్వులు పంచారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా డైరెక్ట్‌ చేసిన తొలి చిత్రం ‘హే సినామిక’. ప్రేమ, పెళ్లి, విడాకులు.. తదితర అంశాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌, అదితిరావు హైదరి, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారులు. జియో స్టూడియోస్‌, గ్లోబల్‌ వన్‌ స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని