Hey Sinamika: రివ్యూ: హే సినామిక
దుల్కర్, కాజల్, అదితి ప్రధాన పాత్రల్లో నటించిన ‘హే సినామిక’ ఎలా ఉందంటే?
చిత్రం: హే సినామిక; నటీనటులు: దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరి, కాజల్ అగర్వాల్ తదితరులు; సంగీతం: గోవింద్ వసంత్; ఛాయాగ్రహణం: ప్రీత జయరామన్; దర్శకత్వం: బృందా; నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్; విడుదల తేదీ: 03-03-2022.
కొత్తదనం నిండిన కథలతో అలరిస్తుంటారు కథానాయకుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). అదే ఆయన్ను మలయాళంతో పాటు అన్ని చిత్రసీమల ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇటీవలే ‘కురుప్’తో సినీ ప్రియులకు వినోదం పంచిన ఆయన.. ఇప్పుడు ‘హే సినామిక’తో బాక్సాఫీస్ ముందుకొచ్చారు. ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా మాస్టర్ తెరకెక్కించిన తొలి చిత్రమిది. విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. దుల్కర్, అదితిరావ్ హైదరి, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం కలిసి నటించడంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఇందుకు తగ్గట్లుగానే ప్రచార చిత్రాలు ఆహ్లాదకరంగా.. మనసులకు హత్తుకునేలా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను సినామిక అందుకుందా? ఈ సినిమాతో దుల్కర్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారా? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే: ఆర్యన్ (దుల్కర్ సల్మాన్), మౌనలది (అదితిరావు హైదరి) (Aditi Rao Hydari) తొలి చూపు ప్రేమ. ఆ ప్రేమను వెంటనే పెళ్లి పీటలెక్కించి దంపతులుగా మారతారు. కానీ, పెళ్లైన రెండేళ్లకు పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. మౌనకు ఆర్యన్‌పై ఉన్న ప్రేమ తగ్గి.. అతనంటే విసుగు, చిరాకు మొదలవుతుంది. దానికి కారణం ఆర్యన్ ఎక్కువగా మాట్లాడుతుండటం, అతను చేసి పెట్టే వంటలు. ఈ కారణాల వల్లే ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం తన ఇంటి పక్కనే ఉంటున్న మలర్ (కాజల్) (Kajal Aggarwal) అనే సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తుంది. ఎలాగైనా తన అందచందాలతో ఆర్యన్‌ను ప్రేమలో పడేయమని కోరుతుంది. అలా పడేస్తే.. దాన్నే కారణంగా చూపించి అతని నుంచి విడాకులు తీసుకుంటానని చెబుతుంది. తాను చెప్పినట్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మౌన చెప్పిన పనికి మలర్ అంగీకరిస్తుంది. ఆర్యన్‌కు దగ్గరై.. అతన్ని తన ప్రేమలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. మరి ఆతర్వాత ఏమైంది? మౌన కోరుకున్నట్లుగా ఆర్యన్.. మలర్ ప్రేమవలలో చిక్కుకున్నాడా? అతని నుంచి ఆమె విడాకులు తీసుకుందా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: నేపథ్యాలలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ, ప్రేమకథలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిని తమదైన శైలిలో తెరపై కొత్తగా ఎలా ఆవిష్కరిస్తారన్న దానిపైనే ఆ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. సినామిక తరహా చిత్రాలు కూడా తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే ఇందులో కథని హీరోయిన్ కోణం నుంచి నడిపిన విధానం బాగుంది. అతిగా మాట్లాడుతూ.. బొమ్మరిల్లు డాడీకి ప్రతిరూపంలా ప్రేమతో వంటలు చేసి పెట్టి చంపేసే భర్త. ఆ అతి ప్రేమ వల్ల తన ప్రశాంతత దూరమవుతుందనుకునే భార్య. ఈ ఇద్దరి మధ్య జరిగే కథే ఈ చిత్రం. దీన్ని వినోదభరితంగా నడిపిస్తూనే.. భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు బృందా. కానీ, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓ ప్రహసనంలాగే సాగుతుంది. దుల్కర్, అదితిల పరిచయ సన్నివేశాలతో చిత్రం సాదాసీదాగా మొదలవుతుంది. ఆ వెంటనే ఇద్దరూ ప్రేమలో పడటం.. ఓ పాట పూర్తయ్యే సరికి ఇద్దరూ దంపతులుగా మారిపోవడం వంటి సన్నివేశాలతో కథ చకచకా పరుగులు పెడుతుంది. కానీ, అసలు దుల్కర్, అదితిల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమేంటన్నది ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఫలితంగా వారి ప్రేమకథతో ప్రేక్షకులు ఆరంభంలోనే డిస్కనెక్ట్ అయిపోతారు.
తన భర్త అతి వాగుడు, వంటల కారణంగా మౌన అతని నుంచి విడిపోవాలనుకోవడం.. ఈ క్రమంలో తన సహచర ఉద్యోగుల సలహాలతో ఆమె చేసే ప్రయత్నాలు అక్కడక్కడా కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే ఆ తర్వాత సాగే కథనమంతా ప్రేక్షకుల సహనానికి పరీక్షలాగే ఉంటుంది. మలర్ పాత్ర కథలోకి ప్రవేశించాకే సినిమాకి మళ్లీ కాస్త ఊపొస్తుంది. విరామానికి ముందు ఆర్యన్‌కు మలర్ దగ్గరవడంతో ద్వితియార్థంలో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి మొదలవుతుంది. మలర్.. ఆర్యన్లు కలిశాక వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లో ఆర్యన్ పలికే సంభాషణలు.. అతనికి, మౌన, మలర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: ఆర్యన్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయారు. ఆయనకు అదితికి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. ద్వితియార్థంలో కాజల్‌కు ఆయనకు మధ్య వచ్చే లవ్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. మౌనగా అదితి కనిపించిన విధానం బాగుంది. మలర్‌గా కాజల్ పరిధి మేరకు నటించింది. ప్రధమార్థంలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత దొరకలేదు. తెరపై ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో బృందా మాస్టర్ పూర్తిగా విఫలమయ్యారు. డ్యాన్సుల విషయంలో మాత్రం తన ప్రతిభను ఆకట్టుకునేలా చూపించారు. పతాక సన్నివేశాల్ని హృద్యంగా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. గోవింద్ వసంత సంగీతం, ప్రీత జయరామన్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. (Hey Sinamika Review)
బలాలు:
+ దుల్కర్, కాజల్, అదితీల నటన
+ ప్రధమార్థం, ముగింపు
+ పాటలు
బలహీనతలు:
- కథ, కథనం..
- ద్వితియార్థం
చివరిగా: అక్కడక్కడా మెప్పించే.. సినామిక.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయమాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? -
Bramayugam Movie Review: రివ్యూ: భ్రమయుగం.. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Bramayugam Movie Review: మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!