Hey Sinamika: మా సినామిక నవ్విస్తుంది.. ప్రేమలో పడేస్తుంది

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు బృందా మాస్టర్‌ తెరకెక్కించిన చిత్రం ‘హే సినామిక’. జియో స్టూడియోస్‌, గ్లోబల్‌ వన్‌ స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌, అదితీరావ్‌ హైదరి

Updated : 02 Mar 2022 08:54 IST

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నృత్య దర్శకురాలు బృందా మాస్టర్‌ తెరకెక్కించిన చిత్రం ‘హే సినామిక’. జియో స్టూడియోస్‌, గ్లోబల్‌ వన్‌ స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌, అదితీరావ్‌ హైదరి కథానాయికలు. ఈ సినిమా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, నిర్మాత డి.సురేష్‌బాబు, దర్శకురాలు నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ ‘‘బృందా మాస్టర్‌ దర్శకురాలిగా మారుతున్నారని తెలిసి చాలా ఆనందించా. ఆమెకి నేను చాలా పెద్ద ఫ్యాన్‌. ‘మనం’లోని ‘కనులను తాకే’ పాట నాకు చాలా ఇష్టం. అలాంటి ఎన్నో చక్కటి మాంటేజ్‌ గీతాలకు ఆమె నృత్య దర్శకురాలిగా చేశారు. ఓ నటుడిగా బృందా మాస్టర్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడామె దర్శకురాలిగా మారినా.. నృత్య దర్శకత్వం చేయడం ఆపొద్దని కోరుకుంటున్నా. దుల్కర్‌తో నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మేమిద్దరం నటులుగా ఇలా ఒకే వేదికపై నిలబడతామని ఎప్పుడూ ఊహించలేదు. ట్రైలర్‌ బాగుంది. ఇందులోని ప్రేమకథ నచ్చింది’’ అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘‘నాకిది చాలా స్పెషల్‌ సినిమా. ఎందుకంటే ఇది బృందా మాస్టర్‌ తొలి సినిమా. ఆమె వల్లే నేను రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకోగలిగా. ఈ సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటారు. డ్యాన్స్‌ చేస్తారు. కంటతడి పెడతారు. ఈ చిత్రంతో ప్రేమలో పడతారు’’ అన్నారు. ‘‘నాకిది తొలి చిత్రమైనా.. కథ చెప్పిన వెంటనే నన్ను నమ్మి ఈ అవకాశమిచ్చినందుకు దుల్కర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు బృంద. ఈ కార్యక్రమంలో అదితీరావ్‌ హైదరి, నటుడు జగపతిబాబు, గేయ రచయిత రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు